Share News

బకాయిలు వెంటనే చెల్లించండి

ABN , Publish Date - Jul 15 , 2026 | 12:06 AM

ఉపాధ్యాయులకు రావాల్సిన పెండింగ్‌ బకాయిలను వెంటనే చెల్లించాలని ఫ్యాప్టో జిల్లా చైర్మన్‌ పి.కురిమినాయుడు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

బకాయిలు వెంటనే చెల్లించండి
నిరసన తెలియజేస్తున్న ఫ్యాప్టో నాయకులు, ఉపాధ్యాయులు

బెలగాం, జూలై 14 (ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయులకు రావాల్సిన పెండింగ్‌ బకాయిలను వెంటనే చెల్లించాలని ఫ్యాప్టో జిల్లా చైర్మన్‌ పి.కురిమినాయుడు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. మంగళవారం ఉపాధ్యాయులు సమస్యలు కోరుతూ ప్యాప్టో ఆధ్వర్యంలో డీఈవో కార్యాలయం నుంచి కలెక్టర్‌ కార్యా లయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్‌ వద్ద ఆందోళన చేశారు. ఈ సందర్భంగా కురిమినాయుడు మాట్లాడుతూ ఉపాధ్యాయులకు పెండింగ్‌లో ఉన్న బకాయిలను తక్షణమే విడుదల చేయాలన్నారు. పీఆర్‌సీ కమిషన్‌ను ఏర్పాటు చేసి 30 శాతం ఐఆర్‌ అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. సర్వీసులోని ఉపాధ్యాయులకు టెట్‌ నుంచి మినహాయింపు కల్పిం చేలా చట్టసవరణ చేయాలన్నారు. కారుణ్య నియామకాలను చేపట్టాలని ప్ర భుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు మురళీమోహన్‌, బాలకృష్ణ, మహేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 15 , 2026 | 12:06 AM