Share News

‘వీఆర్‌ఏలకు పే స్కేలు అమలు చేయాలి’

ABN , Publish Date - Sep 22 , 2026 | 12:20 AM

మండలంలోని వీఆర్‌ఏల డిమాండ్ల సాధన కోసం చేపట్టిన నిరసన సోమవారం ఆరు రోజుకు చేరుకుంది.

 ‘వీఆర్‌ఏలకు పే స్కేలు అమలు చేయాలి’

వంగర, సెప్టెంబరు 21(ఆం ధ్రజ్యోతి): మండలంలోని వీఆర్‌ఏల డిమాండ్ల సాధన కోసం చేపట్టిన నిరసన సోమవారం ఆరు రోజుకు చేరుకుంది. దీనిలో భాగంగా వంగరలో వారంతా అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడు తూ తమ దీర్ఘకాలిక డిమాండ్‌ అయిన పే స్కేలును వెంటనే అమలు చేయాలని కోరారు. అర్హులైన వీఆర్‌ఏలకు వీఆర్వోగా గానీ, తత్సమాన వన్‌ టైం సెటిల్మ్‌ంట్‌ కింద వెంటనే ప్రమోషన్‌ గానీ కల్పించాలని డిమాండ్‌ చేశారు. నామినీ వీఆర్‌ఏ లను రెగ్యులర్‌ చేయాలన్నారు.

Updated Date - Sep 22 , 2026 | 12:20 AM