కనీస వేతనాలు చెల్లించండి
ABN , Publish Date - Mar 04 , 2026 | 12:28 AM
వీరఘట్టం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ముందు మంగళవారం ఆశా కార్యకర్తలు ధర్నా చేశారు.
వీరఘట్టం, మార్చి 3 ఆంధ్రజ్యోతి): వీరఘట్టం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ముందు మంగళవారం ఆశా కార్యకర్తలు ధర్నా చేశారు. తమకు కనీస వేతనాలు చెల్లిం చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్ర మంలో మండలంలోని అన్ని గ్రామాల ఆశ వర్కర్లు పాల్గొన్నారు.
కొమరాడ, మార్చి 3(ఆంధ్రజ్యోతి): ఆశ వర్కర్లు, కమ్యూనిటీ హెల్త్ వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మార్చి 5వ తేదీన చేపట్టనున్న చలో విజయవాడ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సీఐటీ యూ జిల్లా ఉపాధ్యక్షుడు వాకాడ ఇందిర పిలుపునిచ్చారు. మంగళవారం కొమరాడ పీ హెచ్‌సీ ఎంపీహెచ్‌వో నరసింగరావుకు, కూనే రు పీహెచ్‌సీ ఏవోకు వినతిపత్రాన్ని అందిం చారు. సీఐటీయూ నాయకులు కొల్లి సాంబ మూర్తి, గిరిజన సంఘం నాయకుడు తదితరు లు రామారావు పాల్గొన్నారు.