తప్పులు లేకుండా పట్టాదారు పుస్తకాలు
ABN , Publish Date - Jan 18 , 2026 | 12:08 AM
తప్పులు లేకుండా పట్టా దారు పుస్తకాలు అందజేస్తామని ఆర్డీవో జేవీఎస్‌ఎస్ రామ్మోహనరావు తెలి పారు. శనివారం మండలంలోని దిబ్బగుడ్డివలసలో వెంకటరాయుడుపేట రెవెన్యూ గ్రామానికి సంబంధించిన పట్టాదారు పుస్తకాల వివరాలను ఆర్డీవో తనిఖీచేశారు.
బొబ్బిలి రూరల్, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): తప్పులు లేకుండా పట్టా దారు పుస్తకాలు అందజేస్తామని ఆర్డీవో జేవీఎస్‌ఎస్ రామ్మోహనరావు తెలి పారు. శనివారం మండలంలోని దిబ్బగుడ్డివలసలో వెంకటరాయుడుపేట రెవెన్యూ గ్రామానికి సంబంధించిన పట్టాదారు పుస్తకాల వివరాలను ఆర్డీవో తనిఖీచేశారు. రెండోవిడతలో పంపిణీచేయనున్న పాస్‌పుస్తకాలపై వీఆర్వో లతో చర్చించారు. ఇటీవల మొదటివిడతలో పంపిణీ చేసిన పట్టాదారు పాసు పుస్తకాల్లో కొన్ని తప్పులు దొర్లాయని ఫిర్యాదులొస్తున్నాయని తెలిపా రు. రెండోవిడతలో వెంకటరాయుడుపేట రెవెన్యూలోని పంపిణీ కార్యక్రమం చేపడుతున్న దృష్ట్యా రైతుల ద్వారా సర్వే నెంబరు, విస్తీర్ణం, ఆధార్ నెంబరు తదితర వివరాల్లో తప్పులు ఉన్నాయో లేవో రైతుల ద్వారా తెలుసుకొని ఉన్న చోట్ల అప్పటికప్పుడే సరిచేసి ముద్రించడానికి పంపించామని ఆర్డీవో తెలి పారు. కార్యక్రమంలో తహసీల్దార్ ఎం.శ్రీను, వీఆర్వోలు పాల్గొన్నారు.