Share News

ఉన్నత వైద్యం కోసం కేజీహెచ్‌కు వెళ్లిన రోగి మృతి

ABN , Publish Date - Nov 14 , 2026 | 12:39 AM

విశాఖపట్నంలోని కేజీహెచ్‌కు తీసుకువచ్చిన అనారోగ్య పీడితుడికి సమ యానికి చికిత్స చేయకపోవటం, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో తమ కుటుంబ సభ్యుడు మృతి చెందాడని ఆరోపిస్తూ అతడి కుటుంబ సభ్యులు గురువారం అర్ధరాత్రి ఆసు పత్రిలో ఆందోళన చేపట్టారు.

 ఉన్నత వైద్యం కోసం కేజీహెచ్‌కు వెళ్లిన రోగి మృతి

  • సిబ్బంది నిర్లక్ష్యమే కారణమంటూ బంధువుల ఆందోళన

  • సర్దిచెప్పిన అధికారులు

  • ఆసుపత్రి అంబులెన్స్‌లో స్వస్థలం బాడంగికి మృతదేహం తరలింపు

మహారాణిపేట (విశాఖపట్నం), నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): విశాఖపట్నంలోని కేజీహెచ్‌కు తీసుకువచ్చిన అనారోగ్య పీడితుడికి సమ యానికి చికిత్స చేయకపోవటం, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో తమ కుటుంబ సభ్యుడు మృతి చెందాడని ఆరోపిస్తూ అతడి కుటుంబ సభ్యులు గురువారం అర్ధరాత్రి ఆసు పత్రిలో ఆందోళన చేపట్టారు. విజయనగరం జిల్లా బాడంగి మండలానికి చెందిన యు.జగ దీష్‌(43) తీవ్రమైన నిమోనియా, ఊపిరితిత్తుల సమస్యతో విజయనగరం ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు కేజీహె చ్‌కు రిఫర్‌ చేయడంతో గురువారం సాయంత్రం ఇక్కడ క్యాజువాలిటీకి తీసుకు వచ్చారు. ప్రాథమిక చికిత్స అనంతరం అత్యవసర వైద్యం అందిం చాలని ఎక్యూట్‌ మెడికల్‌ కేర్‌ (ఏఎంసీ) విభాగానికి తరలించాలని సూచించా రు. అయితే క్యాజువాలిటీ నుంచి ఏఎంసీకి తరలించే క్రమంలో అక్కడి సిబ్బంది నిర్లక్ష్యం వహించారని, వార్డుకు తరలించేందుకు సిబ్బంది, అంబు లెన్స్‌, వీల్‌ బెడ్‌లు అందుబాటులో లేకపోవటం తో సరైన సమయంలో చికిత్స అందలేదు. దీనితో రోగి కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళన చెందుతుండగా రాత్రి సుమారు 11 గంటల సమయంలో జగదీష్‌ మృతి చెందాడు. దీనితో జగదీష్‌ బంధువులు ఆసుపత్రిలో ఆందోళన చేశారు. సరైన సమయంలో వార్డుకు తరలించి అత్యవసర చికిత్స అందజేసి ఉంటే బతికేవాడని, ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణాన్ని తీసిందని, సిబ్బంది తమ వద్ద డబ్బు కోసం పీడించారని వాపోయారు. తమకు న్యాయం చేయాలని ఆసుపత్రి అధికా రులకు ఫిర్యాదు చేశారు. అధికారులు వారికి సర్ది చెప్పి మహాప్రస్థానం వాహనంలో వారిని స్వస్థలానికి పంపారు.

Updated Date - Nov 14 , 2026 | 12:39 AM