Share News

New Panchayats కొత్త పంచాయతీల ఏర్పాటుకు మార్గం సుగమం

ABN , Publish Date - Jan 13 , 2026 | 12:19 AM

Path Cleared for Formation of New Panchayats కొత్త పంచాయతీల ఏర్పాటుకు మార్గం సుగమమైంది. ప్రస్తుతం జిల్లాలో పంచాయతీలు 451 వరకు ఉండగా.. మరో 15 పంచాయతీల ఏర్పాటుకు ప్రతిపాదనలు వెళ్లాయి. మరో వారం రోజుల్లో ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వనుంది.

 New Panchayats   కొత్త పంచాయతీల ఏర్పాటుకు మార్గం సుగమం

  • జిల్లాలో పెరగనున్న పంచాయతీల సంఖ్య

పార్వతీపురం, జనవరి12(ఆంధ్రజ్యోతి): కొత్త పంచాయతీల ఏర్పాటుకు మార్గం సుగమమైంది. ప్రస్తుతం జిల్లాలో పంచాయతీలు 451 వరకు ఉండగా.. మరో 15 పంచాయతీల ఏర్పాటుకు ప్రతిపాదనలు వెళ్లాయి. మరో వారం రోజుల్లో ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వనుంది. పాలకొండ నియోజకవర్గం వీరఘట్టం మండలంలోని నాలుగు పంచాయతీలు ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ప్రస్తుతం నడిమికెల్ల పంచాయతీలో ఉన్న కడకెల్ల గ్రామాన్ని కొత్త పంచాయతీగా ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు వెళ్లాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం ఈ పంచాయతీలో 2749 మంది జనాభా ఉన్నారు. కడకెల్ల గ్రామంలో 1242 మంది జనాభా ఉన్నారు. దీంతో కడకెల్లను కొత్త పంచాయతీ కేంద్రంగా ఏర్పాటుకు ప్రతిపాదనలు వెళ్లాయి. చలివేంద్రి పంచాయతీలో ఉన్న మహాదేవివలస, హుస్సేన్‌పురం పంచాయతీలో ఉన్న కొంచ గ్రామం, రేగులపాడులో ఉన్న బొడ్డపాడును కొత్త పంచాయతీలుగా ఏర్పాటు చేసే అవకాశం ఉంది. కురుపాం నియోజకవర్గంలో గరుగుబిల్లి మండలం పెద్ద గొడబ పంచాయతీ పరిధిలో ఉన్న సన్యాసిరాజుపేట చిలకాం పరిధిలో ఉన్న దత్తివలస, తోటపల్లి పంచాయతీలో ఉన్న నందివానివలస గ్రామాలను కొత్త పంచాయతీ లుగా గుర్తించాలని ప్రతిపాదనలు వెళ్లాయి. పార్వతీపురం నియోజకవర్గం బలిజిపేట మండలం పెద్దింపేట పంచాయతీ పరిధిలో ఉన్న గౌరీపురం , సాలూరు నియోజకవర్గం.. సాలూరు మండ లంలో నారాలవలస పరిధిలోని పెద్దవలస, కొదమ పంచాయతీలో ఉన్న సిరివర, పాచిపెంట మండలం కర్రివలసలో ఉన్న అమ్మవలస, పాంచాలి పరిధిలో ఉన్న జీలుగువలస, పద్మాపురం పరిధిలోని పిండి రాగివలసను నూతన పంచాయతీలుగా మార్చాలని ప్రతిపాదనలు వెళ్లాయి. పాలకొండ నియోజకవర్గం భామిని మండలం బురుజోల పంచాయతీలో ఉన్న సింగిడి, గురండిలో ఉన్న లోహరజోల గ్రామాలను కొత్త పంచాయతీ కేంద్రాలుగా మారే అవకాశం ఉంది.

Updated Date - Jan 13 , 2026 | 12:19 AM