Share News

తప్పులులేని పాసు పుస్తకాలు ఇవ్వాలి

ABN , Publish Date - Feb 11 , 2026 | 12:00 AM

రైతుల కు తప్పులు లేని పట్టాదారు పాసు పుస్తకాలు ఇవ్వాల ని జేసీ సేతుమాధవన్‌ రెవెన్యూ అధికారులకు సూ చించారు.

తప్పులులేని పాసు పుస్తకాలు ఇవ్వాలి

  • జేసీ సేతుమాధవన్‌, ఆర్డీవో కీర్తి

  • తహసీల్దార్‌ కార్యాలయాల తనిఖీ

శృంగవరపుకోట, ఫిబ్రవరి 10(ఆంధ్రజ్యోతి): రైతుల కు తప్పులు లేని పట్టాదారు పాసు పుస్తకాలు ఇవ్వాల ని జేసీ సేతుమాధవన్‌ రెవెన్యూ అధికారులకు సూ చించారు. స్థానిక తహసీల్దార్‌ కార్యాలయాన్ని ఆయన మంగళవారం సందర్శించారు. మండల పరిధిలోని పెద ఖండేపల్లి, అలుగుబిల్లి, చీడిపాలెం, విశ్వనాథపురం, జెడ్‌.ముకుందాపురం గ్రామాలకు చెందిన రికార్డులను తహసీల్దార్‌ డి.శ్రీనివాసరావుతో కలసి తనిఖీ చేశారు. వ్యక్తిగత వివరాలన్నీ సక్రమంగా నమోదు చేస్తున్నారా.. లేదా.. అంటూ ఆయా గ్రామాలకు చెందిన రెవెన్యూ అధికారులను ప్రశ్నించారు. కంప్యూటర్‌ ఆపరేటర్‌ సూరిబాబు దగ్గర కూర్చొని.. రైతుల ఖాతా నెంబర్ల వారిగా వ్యక్తిగత, భూ వివరాలను పరిశీలించారు. పనితీరు బాగుండడంతో సంతృప్తి వ్యక్తం చేశారు. నిర్దేశించిన గడువు లోపల రీసర్వే జరిగిన తప్పులను సరిదిద్దాలని ఆదేశించారు. డీటీ రంజిత్‌కుమార్‌, ఆర్‌ఐ, ఆర్‌ఎస్‌ డీటీ పాల్గొన్నారు.

గంట్యాడ, ఫిబ్రవరి 10(ఆంధ్రజ్యోతి): భూసర్వే పూర్తయిన గ్రామాల్లో పంపి ణీ చేస్తున్న పాసు పుస్తకాల్లో తప్పులు లేకుండా చూడా లని ఆర్డీవో కీర్తి సూచించారు. మంగళవారం ఆమె గంట్యాడ తహసీల్దా ర్‌ కార్యాలయాన్ని సందర్శించారు. పట్టాదారు పాసు పుస్తకాల్లో ఉన్న తప్పులను ఎలా సరి చేస్తున్నారు.. అనే దానిపై ఆరా తీశారు. తప్పులు ఉన్న వాటిని సరిచేసి, కొత్తగా ముద్రించి రైతులకు పంపిణీ చేయాలన్నారు. మార్చి నెలలో పెంటశ్రీరాంపురం, రేగుబిల్లి, వైఎస్‌ఆర్‌ పురం గ్రామాలకు చెందిన 2,197 పట్టాదారు పాసు పుస్తకాల సవరణపై పర్యవేక్షించాల న్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ నీలకంఠేశ్వర రెడ్డి, రీసర్వే డీటీ నాగలక్ష్మి, ఆర్‌ఐ ప్రసాద్‌ పాల్గొన్నారు.

Updated Date - Feb 11 , 2026 | 12:00 AM