Share News

Passbook రాజముద్రతో పాస్‌ పుస్తకం.. రైతుల్లో ఆనందం

ABN , Publish Date - Jan 10 , 2026 | 11:30 PM

Passbook with Government Seal Brings Cheer to Farmers రైతుల భూ హక్కులకు పూర్తి భద్రత కల్పించాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం కొత్తగా పట్టాదారు పాస్‌ పుస్తకాలు అందజేస్తున్న సంగతి తెలిసిందే. అయితే దీనిపై జిల్లావాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Passbook    రాజముద్రతో పాస్‌ పుస్తకం.. రైతుల్లో ఆనందం
ప‌ట్టాదారు పాస్ పుస్త‌కం..

  • ఈకేవైసీ ప్రక్రియలో సిబ్బంది

  • మరికొద్ది రోజుల్లో పూర్తిస్థాయిలో అందజేత

  • భూ హక్కులకు పూర్తి భద్రత కల్పించారని అన్నదాతల వెల్లడి

పార్వతీపురం, జనవరి10(ఆంధ్రజ్యోతి): రైతుల భూ హక్కులకు పూర్తి భద్రత కల్పించాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం కొత్తగా పట్టాదారు పాస్‌ పుస్తకాలు అందజేస్తున్న సంగతి తెలిసిందే. అయితే దీనిపై జిల్లావాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని సీఎం చంద్రబాబునాయుడు నెరవేర్చి పండుగ కానుక ఇచ్చారని రైతులు చెబుతున్నారు. మొత్తంగా మాజీ సీఎం జగన్‌ ఫొటోతో ఉన్న పాస్‌పుస్తకాల స్థానంలో.. జారీ చేసిన కొత్తవాటిని చూసి వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

జిల్లాలో తొలివిడతగా 76,973 మంది రైతులకు నూతన పట్టాదారు పాస్‌పుస్తకాలను పంపిణీ చేయాలని అధికారులు నిర్ణయించారు. అయితే ఈకేవైసీ పూర్తయిన వారికే వాటిని అందిస్తున్నారు. మరోవైపు నాలుగు నియోజకవర్గాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ కార్యక్రమంలో భాగస్వా ములై వాటి ఉపయోగాలను వివరిస్తున్నారు. కాగా ఈ నెల 9 వరకు 64,495 మంది రైతులకు ఈకేవైసీ పూర్తి చేసి పాస్‌ పుస్తకాలు అందించారు. ఈ పంపిణీలో పాలకొండ మండలం ప్రథమ స్థానంలో ఉంది. ఇక్కడ 10,175మంది రైతులకు పుస్తకాలు పంపిణీ చేశారు. ఇక రెండో స్థానంలో నిలిచిన బలిజిపేట మండలంలో 6667 మందికి , మూడో స్థానంలో సీతానగరం మండలంలో 6,400 మంది రైతులకు పుస్తకాలు అందజేశారు. మిగిలిన మండలాల్లో కూడా చురుగ్గా ఈకేవైసీ పూర్తి చేసి మరి కొద్దిరోజుల్లోనే రైతులందరికీ నూతన పట్టాదారు పాస్‌ పుస్తకాలు అందిం చనున్నారు.

‘ మా భూములపై సర్వ హక్కులు కల్పిస్తూ.. రాజముద్రతో ప్రభుత్వం నూతన పట్టాదారు పాస్‌ పుస్తకాలు అందించడం ఎంతో ఆనందంగా ఉంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జగన్‌ ఫొటోతో పాస్‌ పుస్తకాలు ఉండేవి. తప్పుల తడకలతో నిండిన వాటిపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించి.. వాటి స్థానంలో కొత్త పాస్‌ పుస్తకాలు అందించడం సంతోషంగా ఉంది. లోపాలన్నీ సరిచేయడంతో భవిష్యత్‌లో ఇక భూ సమస్యలు ఉండవని భావిస్తున్నాం. ’ అని జియ్యమ్మవలస మండలానికి చెందిన రైతులు ఎం.తాతబాబు, ఎం.సత్యనారాయణ, అక్కేన సుజాత తెలిపారు.

Updated Date - Jan 10 , 2026 | 11:30 PM