‘రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలు’
ABN , Publish Date - Jun 04 , 2026 | 12:26 AM
ప్రభుత్వ రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను రైతులకు అందజేసి వారి గౌరవాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరింత పెంచారని ప్రభుత్వ విప్ జగదీశ్వరి అన్నారు.
గుమ్మలక్ష్మీపురం, జూన్ 3 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను రైతులకు అందజేసి వారి గౌరవాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరింత పెంచారని ప్రభుత్వ విప్ జగదీశ్వరి అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ఎల్విన్‌పేట సచివాలయ ప్రాంగణంలో రైతులకు పట్టాదారు పాస్‌పుస్తకాలను ఆమె పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గతంలో వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్‌రెడ్డి ఫొటోతో జారీ చేసిన పట్టాదారు పాస్‌పుస్తకాలను రద్దు చేసి కూటమి ప్రభుత్వం కొత్తవి పంపిణీ చేస్తోందన్నారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బిడ్డిక పద్మావతి, మాజీ కన్వీనర్ పాడి సుదర్శనరావు, ఎంపీడీవో ఎల్.శ్రీనివాసరావు, తహసీల్దార్ శేఖరం తదితరులు పాల్గొన్నారు.