కార్యకర్తలు ప్రజలతో మమేకం కావాలి
ABN , Publish Date - Oct 20 , 2026 | 12:03 AM
నాయకులు, కార్యకర్తలు ప్రజలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకుని పరిష్కారం దిశగా చిత్తశుద్ధితో పని చే యాలని రాజాం ఎమ్మెల్యే కోండ్రు మురళీ మోహన్ పిలుపునిచ్చారు.
రాజాం ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్
రాజాం, అక్టోబరు19 (ఆంధ్రజ్యోతి): నాయకులు, కార్యకర్తలు ప్రజలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకుని పరిష్కారం దిశగా చిత్తశుద్ధితో పని చే యాలని రాజాం ఎమ్మెల్యే కోండ్రు మురళీ మోహన్ పిలుపునిచ్చారు. సోమవారం శ్యాంపురం క్యాంపు కార్యాలయంలో రేగిడి, సంతకవిటి మండలాల నా యకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భం గా మాట్లాడుతూ స్థానికసంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు సమ న్వయంతో, సమష్టి కార్యాచరణతో ముందుకు సాగాల ని కోరారు. కార్యక్రమంలో నాయకులు కొల్ల అప్పలనా యుడు, గురవాన నారాయణరావు, గురాన అయ్యలు, ఉప్పలపూడి శ్రీనివాసరావు, వల్లూరు గణేష్, ధర్మారావు, పొగిరి సురేష్,పాలూరి రామినాయుడు పాల్గొన్నారు.