Share News

పరిషత్‌ పోరు ప్రశాంతం

ABN , Publish Date - Nov 06 , 2026 | 01:05 AM

జిల్లాలో పరిషత్‌ ఎన్నిక లు గురువారం ప్రశాంతంగా ముగిశాయి.

 పరిషత్‌ పోరు ప్రశాంతం
భామిని: బొడ్డగూడలో క్యూలో ఉన్న గిరిజన మహిళలు

- ముగిసిన పోలింగ్‌

- 11 గంటల తర్వాత కేంద్రాలకు పోటెత్తిన ఓటర్లు

- మంత్రి, కలెక్టర్‌, ఎస్పీ పరిశీలన

-భద్రంగా స్ట్రాంగ్‌రూములకు బ్యాలెట్‌ బాక్స్‌ల తరలింపు

-రేపు కౌంటింగ్‌

-మైక్రో అబ్జర్వర్ల నియామకం

పార్వతీపురం, నవంబరు 5 (ఆంధ్ర జ్యోతి): జిల్లాలో పరిషత్‌ ఎన్నిక లు గురువారం ప్రశాంతంగా ముగిశాయి. 15 జడ్పీటీసీ స్థానాలకు, 226 ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి అన్ని మండలాల్లో ఉదయం ఏడు గంటల నుంచి పోలింగ్‌ ప్రారంభమైంది. ఓటేసేందుకు ఓటర్లు బారులు తీరారు. దీంతో పోలింగ్‌ కేంద్రాల వద్ద భారీ క్యూలైన్లు కనిపిం చాయి. యువత కూడా పెద్దఎత్తున కేంద్రాలకు చేరుకుని ఓటు వేశారు. దివ్యాంగులు, వృద్ధులు సైతం తరలివ చ్చా రు. వీరు పోలింగ్‌ కేంద్రాల్లోకి వెళ్లేందుకు ఎన్నికల సిబ్బంది సహకరించారు. జిల్లాలో 52 మంది జడ్పీటీసీ అభ్యర్థులు, 540 మంది ఎంపీటీసీ అభ్యర్థులు బరిలో నిలిచారు. ఒక్కొ క్క ఓటరు రెండు ఓట్లను వేశారు. ఒక ఓటు ఎంపీటీసీ అభ్యర్థికి, మరో ఓటు జడ్పీటీసీ అభ్యర్థికి వేశారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు గట్టి బందో బస్తు నిర్వహించారు. పాచిపెంట జడ్పీ ఉన్నత పాఠ శాలలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రాలను మంత్రి గుమ్మడి సంధ్యారాణి సందర్శించారు. ఎన్నికల నిర్వహణపై పోలింగ్‌ అధి కారులను అడిగి తెలుసుకున్నారు. గరుగుబిల్లి మండలం రావుపల్లి పోలింగ్‌ కేంద్రాన్ని కలె క్టర్‌ ఎం.ప్రభాకర్‌రెడ్డి పరి శీలించి ఓటర్లతో మాట్లాడారు. గరుగుబిల్లి పాఠశాలలోని పోలింగ్‌ కేంద్రాన్ని ఎస్పీ మాధవరెడ్డి సందర్శించారు. మౌలిక సదుపాయాలు, భద్రత ఏర్పాట్లను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. చెదురుముదురు ఘటనలు మినహా ప్రశాంతంగా పోలింగ్‌ ముగియడంతో యంత్రాంగం ఊపిరిపీల్చుకుంది.

స్ట్రాంగ్‌ రూంలకు బ్యాలెట్‌ బాక్స్‌లు

అత్యంత పోలీసు భద్రత నడుమ బ్యాలెట్‌ బాక్సులను స్ర్టాంగ్‌రూంలకు తరలిం చారు. దీనికోసం 108 బస్సు రూ ట్లను ఏ ర్పాటు చేశారు. పోలింగ్‌ సిబ్బందితో పాటు బ్యాలెట్‌ బాక్సు లను సురక్షితంగా పోలింగ్‌ కేంద్రాలకు తరలించారు. ఏజెం ట్ల సమక్షంలో బ్యాలెట్‌ బాక్సులకు సీల్‌ వేశారు.

ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యేలు..

గుమ్మలక్ష్మీపురం మండలం తాడికొండ ఎంపీటీసీ సెగ్మెం ట్‌లో ప్రభుత్వ విప్‌, కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీ శ్వరి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. గతంలో ఈ సెగ్మెంట్‌ నుంచి ఎంపీటీసీగా ఆమె ప్రాతినిధ్యం వహించారు. పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర తన సతీమణి అనూష్‌తో కలిసి వెంకటంపేట పోలింగ్‌ కేంద్రంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు.

రేపే ఓట్ల లెక్కింపు

ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు పో లైన ఓట్లను అధికారులు శని వారం లెక్కించి ఫలితాలను ప్రకటించనున్నారు. పార్వతీపురం, సీతాన గరం, బలిజిపేట మండలాల ఓట్లను పార్వతీపురం ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలోని కౌంటింగ్‌ కేంద్రంలో, గుమ్మలక్ష్మీపురం కొమరాడ, కురుపాం, జియ్యమ్మవలస, గరుగుబిల్లి మండలాల ఓట్లను గరుగుబిల్లి మండలం ఉల్లిభద్రలోని ప్రభుత్వ ఉద్యాన కళాశాలలో, మక్కువ, పాచిపెంట, సాలూరు మండలాల ఓట్లను సాలూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో, భామిని, సీతంపేట, పాలకొండ, వీరఘట్టం మండలాలకు సంబంధించిన ఓట్లను పాలకొండ డిగ్రీ కళాశాల కౌంటింగ్‌ కేంద్రంలో లెక్కించనున్నారు.

చెదురు ముదురు ఘటనలు..

జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న పెద్దబొండపల్లి, నర్సిపురం గ్రామాల్లో టీడీపీ, వైసీపీ కార్య కర్తల మధ్య స్వల్ప తోపులాట చోటుచేసుకుంది. పోలింగ్‌ కేంద్రాల వద్ద ఒక పార్టీకి చెందిన మద్ద తుదారులు ఉంటున్నారని మరొక పార్టీకి చెందిన వారు ఆరోపించడంతో ఇరువర్గాలు తోపులాటకు దిగాయి. పోలీసులు వారికి సర్దిచెప్పడంతో వివాదం సద్దుమణిగింది. మక్కువ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ బూత్‌లను మంత్రి సంధ్యారాణి పరిశీలించారు. ఈ సమయంలో వైసీపీకి చెందిన కొంతమంది వ్యక్తులు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. స్థానిక టీడీపీ నేతలకు చేతకాక మంత్రిని ఇక్కడకు రప్పించారంటూ ఎద్దేవా చేయడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ, తోపులాట చోటుచేసుకొంది. పోలీసులు రంగంలోకి దిగి వారిని చెదరగొట్టారు.

కంట్రోల్‌ రూమ్‌ నుంచి పర్యవేక్షణ

జిల్లాలో పోలింగ్‌ ప్రక్రియను కలెక్టరేట్‌లోని ప్రత్యేక కంట్రోల్‌ రూమ్‌ నుంచి కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి హేమలత, జడ్పీ సీఈవో సుధాకర్‌ పర్యవేక్షించారు. పోలింగ్‌ సరళిని, సిబ్బంది పనితీరును కలెక్టర్‌ పరిశీలించారు. ఓటర్లు ఇబ్బంది పడకుండా పోలింగ్‌ ప్రక్రియను వేగవంతం చేయాలని, సున్నిత ప్రాంతాల్లో భద్రతా చర్యలను గమనిస్తూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు నిర్వహించాలని పోలీస్‌, రెవెన్యూ అధికారులను ఆదేశించారు.

11 తరువాత బారులు తీరిన ఓటర్లు

ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు అంతంత మాత్రమే పోలింగ్‌ జరిగింది. 9 గంటల వరకు 4.18 శాతం, 11 గంటల వరకు 28.10శాతం పోలింగ్‌ నమోదైంది. 11 గం టల తరువాత ఓటు హక్కు వినియోగించుకొనేం దుకు ఓటర్లు పోలింగ్‌ కేంద్రాలకు తరలివచ్చారు. మధ్యాహ్నం ఒంటి గంటకు 43.44 శాతం, మూడు గంటల వరకు 56.18 శాతం, సాయంత్రం 5 గంటలకు 67శాతం ఓటింగ్‌ నమోదైంది. జిల్లాలో మొత్తం 6,43,875 మంది ఓటర్లు ఉండగా, సాయంత్రం ఐదు వరకు 4,31,422 మంది ఓటు వేశారు. కొన్ని పోలింగ్‌ కేంద్రాల్లో సాయంత్రం ఐదు దాటిన తరువాత కూడా పోలింగ్‌ కొనసాగింది.

మైక్రో అబ్జర్వర్ల నియామకం

ఓట్ల లెక్కింపు పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు కలెక్టర్‌, ఎన్నికల అధికారి ప్రభాకర్‌రెడ్డి మైక్రో అబ్జర్లను నియమించారు. జనరల్‌ అబ్జర్వర్‌ పర్యవేక్షణలో మైక్రో అబ్జర్వర్లు కౌంటింగ్‌ ప్రక్రియను పరిశీలిస్తారని, అక్రమాలు లేదా సమస్యలు గుర్తిస్తే వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించాలని కలెక్టర్‌ ఆదేశించారు. కౌంటింగ్‌ రూమ్‌ల కేటాయింపును రాండమ్‌ డ్రా పద్ధతిలో చేపట్టి సిబ్బందికి శిక్షణ, గుర్తింపు కార్డులు, హానోరియం అందించాలని సూచించారు.

Updated Date - Nov 06 , 2026 | 01:05 AM