Share News

Parents should act responsibly. తల్లిదండ్రులు బాధ్యతగా వ్యవహరించాలి

ABN , Publish Date - May 26 , 2026 | 12:06 AM

Parents should act responsibly. పిల్లల పట్ల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు బాధ్యతగా వ్యవహరించాలని జిల్లా న్యాయాధికారి ఎం.బబిత సూచించారు. రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ ఆదేశాలతో సోమవారం జిల్లా కోర్టు ప్రాంగణంలో ఇంటర్నేషనల్‌ మిస్సింగ్‌ చిల్డ్రన్‌ డే కార్యక్రమం జరిగింది.

Parents should act responsibly. తల్లిదండ్రులు బాధ్యతగా వ్యవహరించాలి
మాట్లాడుతున్న ప్రధాన న్యాయమూర్తి బబిత

తల్లిదండ్రులు బాధ్యతగా వ్యవహరించాలి

పిల్లలకు సెల్‌ఫోన్లు ఇవ్వొద్దు

జిల్లా న్యాయాధికారి బబిత

విజయనగరం దాసన్నపేట, మే 25 (ఆంధ్రజ్యోతి): పిల్లల పట్ల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు బాధ్యతగా వ్యవహరించాలని జిల్లా న్యాయాధికారి ఎం.బబిత సూచించారు. రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ ఆదేశాలతో సోమవారం జిల్లా కోర్టు ప్రాంగణంలో ఇంటర్నేషనల్‌ మిస్సింగ్‌ చిల్డ్రన్‌ డే కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన బబిత మాట్లాడుతూ పిల్లలను సెల్‌ఫోన్‌ వినియోగానికి దూరంగా ఉంచాలన్నారు. పిల్లల పట్ల నిర్లక్ష్యంగా వుండడం వల్ల రోజుకు సగటున తొమ్మిది మంది పిల్లలు తప్పిపోతుండడం ఆందోళన కలిగించే విషయమన్నారు. పిల్లలు తప్పిపోయిన 24 గంటల్లో కేసు నమోదు చేయాలన్నారు. పీఎల్‌ఏపీయుస్‌ చైర్మన్‌ దుర్గయ్య మాట్లాడుతూ, ఎన్‌సీబీ రికార్డుల ప్రకారం ప్రతి రోజూ పుట్టిన శిశువుల్లో ఏడు శాతం తప్పిపోవడం బాధాకరమన్నారు. పిల్లల దత్తత, హక్కులు, విద్యా అవకాశాలపై అవగాహన పెంపొందించుకోవాలని, విద్యా హక్కు చట్టాన్ని వినియోగించుకోవాలని అన్నారు. కార్యక్రమంలో విజయనగరం ఇన్‌చార్జి డీఎస్పీ రాఘవులు, ఏపీపీ గేదెల సత్యం, ఎంఈఓ ఆనందమూర్తి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 26 , 2026 | 12:06 AM