Share News

Tourist Destination పారమ్మకొండను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం

ABN , Publish Date - Nov 11 , 2026 | 11:04 PM

Parammakonda to Be Developed as a Tourist Destination పారమ్మకొండను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి అన్నారు. బుధవారం పారమ్మకొండపై ఉన్న పారమ్మతల్లిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఎత్తయిన శిఖరాల్లో పారమ్మకొండ ఒకటని, రానున్న రోజుల్లో అతిపెద్ద టూరిజంగా ఇది అభివృద్ధి చెందనుందని తెలిపారు.

 Tourist Destination పారమ్మకొండను  పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం
పారమ్మకొండపైకి వెళ్తున్న కలెక్టర్‌

పాచిపెంట రూరల్‌, నవంబరు 11(ఆంధ్రజ్యోతి): పారమ్మకొండను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి అన్నారు. బుధవారం పారమ్మకొండపై ఉన్న పారమ్మతల్లిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఎత్తయిన శిఖరాల్లో పారమ్మకొండ ఒకటని, రానున్న రోజుల్లో అతిపెద్ద టూరిజంగా ఇది అభివృద్ధి చెందనుందని తెలిపారు. కార్తీకమాసంలో ఇక్కడికే వచ్చే భక్తులు ఇబ్బంది పడకుండా .. కొండపైకి తాగునీరు , విద్యుత్‌ వంటి సౌకర్యాలు కల్పిస్తామన్నారు. స్వచ్ఛంద సంస్థలు, కమిటీ, దాతల సహకారంతో పారమ్మకొండ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు ఇప్పటికే దాతలు సుమారు రూ.ఆరు లక్షలు ఇచ్చినట్లు వెల్లడించారు. రాత్రి వేళల్లో పారమ్మకొండకు వచ్చే భక్తుల కోసం సదుపాయాలు కల్పిస్తామన్నారు. ఇందుకోసం ప్రత్యేక టూరిజం వెబ్‌సైట్‌కు కూడా ఏర్పాటు చేశామన్నారు.

37 జలపాతాలు గుర్తింపు...

జిల్లాలో ఇప్పటివరకు 37 జలపాతాలు గుర్తించామని కలెక్టర్‌ తెలిపారు. మరో ఐదు నుంచి పది జలపాతాలను గుర్తించే అవకాశం ఉందన్నారు. వాటి అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నా మన్నారు. తీగలపాడులో పాలధార జలపాతం వద్ద మౌలిక వసతుల కల్పనకు శ్రీకారం చుట్టామని తెలిపారు. సాలూరు ఆర్టీసీ డిపో నుంచి కందిరివలస, పెదచీపురువలస పారమ్మకొండ మీదుగా పాచిపెంట వరకు బస్సు సౌకర్యం కల్పించాలని ఆయా ప్రాంత గిరిజనులు కోరారు. ఆయన వెంట సబ్‌ కలెక్టర్‌ పవార్‌ స్వప్నిల్‌ జగన్నాథ్‌, డీఆర్‌డీఏ పీడీ ప్రభావతి తదితరులు ఉన్నారు.

Updated Date - Nov 11 , 2026 | 11:04 PM