Share News

పారామెడికల్‌ విద్యార్థుల నిరసన

ABN , Publish Date - Feb 13 , 2026 | 12:16 AM

నగరంలోని మహారాజా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి వద్ద గురువారం పారామెడికల్‌ విద్యా ర్థులు నిరసన తెలిపారు.

పారామెడికల్‌ విద్యార్థుల నిరసన

విజయనగరం రింగురోడ్డు, ఫిబ్రవరి 12(ఆంధ్ర జ్యోతి): నగరంలోని మహారాజా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి వద్ద గురువారం పారామెడికల్‌ విద్యా ర్థులు నిరసన తెలిపారు. విద్యార్థులు శ్యామ్యూల్‌ రాజు, తేజస్విని, ప్రవీణ్‌, అరుణ, పైడినాయుడులు మాట్లాడుతూ, నగరంలోని సింహగిరి పారా మెడిక ల్‌ కళాశాలలో రేడియాలజీ కోర్సు చదువుతున్న తమకు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో శిక్షణ పొందేందుకు డైరక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ నుంచి స్పష్టమైన ఉత్తర్వులు వచ్చాయన్నారు. అయితే ఈ ఆసుపత్రిలోని రేడియోలజీ విభాగం అధిపతి (హెచ్‌వో డీ) డా.శ్రీధర్‌ వ్యక్తిగత కారణాలతో తమకు శిక్షణ ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే తమకు శిక్షణను అందించి, న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. అనంతరం ఆసుపత్రి సూపరింటెండెంట్‌ అల్లు పద్మజ ను కలిసి, తమ గోడును వెల్లబుచ్చారు. దీనిపై సాను కూలంగా స్పందించిన ఆమె.. సంబంధిత విభాగా లతో మాట్లాడి, రెండు రోజుల్లో సమస్య పరిష్కరించి, శిక్షణ అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. దీంతో విద్యార్థులు శాంతించారు.

Updated Date - Feb 13 , 2026 | 12:16 AM