Share News

Panchayats మూడు గ్రేడ్లలో పంచాయతీలు

ABN , Publish Date - Jul 10 , 2026 | 12:10 AM

Panchayats Divided into Three Grades పంచాయతీల అభివృద్ధికి గ్రామీణ అభివృద్ధిశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ఐదు కేటగిరీల్లో ఉన్న పంచాయతీలను మూడు కేటగిరీలకు పరిమితం చేసింది.

Panchayats   మూడు గ్రేడ్లలో పంచాయతీలు

  • ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం

పార్వతీపురం, జూలై 9(ఆంధ్రజ్యోతి): పంచాయతీల అభివృద్ధికి గ్రామీణ అభివృద్ధిశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ఐదు కేటగిరీల్లో ఉన్న పంచాయతీలను మూడు కేటగిరీలకు పరిమితం చేసింది. గతంలో గ్రేడ్‌-1, గ్రేడ్‌-2, గ్రేడ్‌-3, గ్రేడ్‌-4, గ్రేడ్‌-5 పంచాయతీలు జిల్లాలో ఉండేవి. ఇకపై అలా కాకుండా గ్రేడ్‌-1 గ్రేడ్‌-2, గ్రేడ్‌-3 రూర్బన్‌ పంచాయతీలను మినహాయించి గ్రేడ్‌-4, గ్రేడ్‌-5 పంచాయతీలను గ్రేడ్‌-3గా గుర్తిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. జిల్లాలో రూర్బన్‌ పంచాయతీలు మూడు ఉన్నాయి. గ్రేడ్‌-1 కింద 136 పంచాయతీలు, గ్రేడ్‌-2 కింద వంద పంచాయతీలు, గ్రేడ్‌-3 కింద 312 పంచాయతీలు ఉన్నాయి. మొత్తం 451 పంచాయతీల్లో కార్యదర్శుల పోస్టులు మంజూరైనప్పటికీ.. ప్రస్తుతం జిల్లాలో 419 మంది వివిధ హోదాలో ఉన్నారు. 32 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్‌ 90 ప్రకారం తాజాగా ఏర్పడిన పంచాయతీలకు ఉద్యోగులను సర్దుబాటు చేయాల్సి ఉంది. ప్రస్తుతం పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతోంది. ప్రభుత్వ తాజా ఆదేశాల ప్రకారం.. పంచాయతీ డెవలప్‌మెంట్‌ అధికారులుగా గ్రామ కార్యదర్శులు ఉంటారు. స్థానిక ఎన్నికల అనం తరం సర్పంచ్‌ల పాలన ప్రారంభమైన తర్వాత కూడా వారు ఆ హోదాలోనే కొనసాగనున్నారు.

Updated Date - Jul 10 , 2026 | 12:10 AM