Panchayat Special Officers బాధ్యతలు స్వీకరించిన పంచాయతీ ప్రత్యేకాధికారులు
ABN , Publish Date - Apr 05 , 2026 | 12:05 AM
Panchayat Special Officers Assume Charge జిల్లాలోని పలు పంచాయతీల్లో శనివారం ప్రత్యేకాధికారులు బాధ్యతలు స్వీకరించారు. సర్పంచ్‌ల పదవీ కాలం ఈ నెల 2తో ముగిసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి ఆమోదంతో 451 పంచాయతీలకు ప్రత్యేకాధికారులను నియమిస్తూ.. డీపీవో కొండలరావు ఉత్తర్వులు జారీ చేశారు.
సాలూరు రూరల్, ఏప్రిల్ 4(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని పలు పంచాయతీల్లో శనివారం ప్రత్యేకాధికారులు బాధ్యతలు స్వీకరించారు. సర్పంచ్‌ల పదవీ కాలం ఈ నెల 2తో ముగిసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి ఆమోదంతో 451 పంచాయతీలకు ప్రత్యేకాధికారులను నియమిస్తూ.. డీపీవో కొండలరావు ఉత్తర్వులు జారీ చేశారు. తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఎంఈవోలు, మండల వ్యవసాయాధికారులు, సీడీపీవోలు తదితర 122 మంది గెజిటెడ్ అధికారులకు 451 పంచాయతీల బాధ్యతలు అప్పగించారు. కాగా సాలూరు ఎంపీడీవో జి. పార్వతీ కొఠియా గ్రూప్ పంచాయతీ గంజాయిభద్రలో పంచాయతీ ప్రత్యే కాధికారిగా బాధ్యతలు స్వీకరించారు.