Share News

‘Palle Nidra’ సమస్యలు తెలుసుకోవడానికే ‘పల్లెనిద్ర’

ABN , Publish Date - Aug 25 , 2026 | 12:19 AM

‘Palle Nidra’ to understand the problems of villagers క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలను తెలుసుకో వడానికే పల్లెనిద్ర కార్యక్రమం చేపడుతున్నట్లు ఎస్పీ మాధవరెడ్డి తెలిపారు. సోమవారం రాత్రి నర్సిపురం గ్రామంలోని ఎంపీపీ పాఠశాలలో ‘పల్లెనిద్ర’ నిర్వహించారు.

‘Palle Nidra’  సమస్యలు తెలుసుకోవడానికే ‘పల్లెనిద్ర’
నర్సిపురంలో మాట్లాడుతున్న ఎస్పీ

పార్వతీపురం రూరల్‌, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి): క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలను తెలుసుకో వడానికే పల్లెనిద్ర కార్యక్రమం చేపడుతున్నట్లు ఎస్పీ మాధవరెడ్డి తెలిపారు. సోమవారం రాత్రి నర్సిపురం గ్రామంలోని ఎంపీపీ పాఠశాలలో ‘పల్లెనిద్ర’ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజలను భాగస్వాములను చేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు. ప్రతీ చిన్న సమస్యకు పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లకుండానే పరిష్కార మార్గం చూపేందుకు పల్లెనిద్ర ఒక వేదికగా నిలుస్తుందన్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాల జోలికి ఎవరూ వెళ్లరాదన్నారు. ఐక్యంగా ఉంటూ గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. నేరాల నియంత్రణకు సహకరించాలన్నారు. పోలీస్‌ శాఖ ప్రజలకు మరింత చేరువ చేసేందుకు.. నమ్మకాన్ని పెంచేందుకు పల్లెనిద్ర కార్యక్రమం ఎంతగానో దోహదపడు తుందని తెలిపారు. గ్రామంలో ఇంటింటికీ వెళ్లి కరపత్రాలు పంపిణీ చేసిన అనంతరం పాఠశాలలోనే ఎస్పీ బస చేశారు. ఆయన వెంట రూరల్‌ సీఐ రఘునాఽథం, ఎస్‌ఐ రాజేష్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - Aug 25 , 2026 | 12:19 AM