నేడు పైడిమాంబ జాతర ప్రచార రథం ప్రారంభం
ABN , Publish Date - Sep 21 , 2026 | 12:09 AM
ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్యదైవం పైడిమాంబ జాతరకు సంబంధించిన ప్రచార రథం సోమవారం ఉదయం 10 గంటలకు మూడు లాంతర్ల వద్ద ఉన్న చదురుగుడి నుంచి ప్రారంభం కానున్నది.
విజయనగరం రూరల్, సెప్టెంబరు 20(ఆంధ్రజ్యో తి): ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్యదైవం పైడిమాంబ జాతరకు సంబంధించిన ప్రచార రథం సోమవారం ఉదయం 10 గంటలకు మూడు లాంతర్ల వద్ద ఉన్న చదురుగుడి నుంచి ప్రారంభం కానున్నది. విజయనగ రం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు, ఆలయ ఈవో శిరీష, పైడిమాంబ ఆలయ అర్చకులు, ఉద్యోగులు, ధర్మకర్తల మండలి సభ్యులు, పైడిమాంబ సేవా పీఠం భక్తులు పెద్దఎత్తున పాల్గోనున్నారు. అక్టోబరు నెల 26, 27 తేదీల్లో విజయనగరం పైడిమాంబ జాత ర జరగనున్నది. ఈ జాతరకు సంబంధించిన తొలేళ్లు, సిరిమానోత్సవం, ఇతర కార్యక్రమాలపై ఊరురా ప్రచా రం నిర్వహించనున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లా తదితర జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో ఈ ప్రచారం రథం నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం వెళ్లి ప్రచారం చేయనున్నది. ఈ ప్రచార రథం పర్యటన సందర్భంగా నెల్లిమర్లలోని రామతీర్థాలు, శ్రీకాకుళం లోని అరసవిల్లి, శ్రీకూర్మం, విశాఖ జిల్లా కనకమహా లక్ష్మీ అమ్మవారి ఆలయం, సింహాచలం నరసింహ స్వామి ఆలయాల వద్ద ప్రచారం నిర్వహించనున్నది.