Share News

సింహాచలానికి పాదయాత్ర

ABN , Publish Date - Jul 25 , 2026 | 12:35 AM

మండలంలోని మంగళపాలెం గ్రామం నుంచి సుమారు రెండు వేలమంది భక్తులు సింహాచలానికి పాదయాత్రగా వెళ్లారు.

సింహాచలానికి పాదయాత్ర

  • మంగళపాలెం నుంచి వేలాదిగా తరలివెళ్లిన భక్తులు

కొత్తవలస, జూలై 24(ఆంధ్రజ్యోతి): మండలంలోని మంగళపాలెం గ్రామం నుంచి సుమారు రెండు వేలమంది భక్తులు సింహాచలానికి పాదయాత్రగా వెళ్లారు. గ్రామంలోని గురుదేవ చారిటబుల్‌ ట్రస్టు ఆధ్వర్యంలో వీరు ఈ పాదయాత్ర చేపట్టారు. జగన్నాథ రథయాత్ర సందర్భంగా ప్రతి ఏటా పాదయాత్ర చేస్తున్నామని ట్రస్టు వ్యవస్థాపక చైర్మన్‌ రాపర్తి జగదీష్‌బాబు తెలిపారు. విజయనగరం, విశాఖపట్నం, మన్యం పార్వతీపురం, అల్లూరి సీతారామరాజు జిల్లాలకు చెందిన వివిధ ఏజెన్సీ మండలాలలోని గిరిజన గ్రామాలకు చెందిన గిరిజనులతో పాటు, తరిగొండ వెంగమాంబ భక్త జనమండలి భజన బృందం సభ్యులు ఈ పాదయాత్రలో పాల్గొన్నారు. ముందుగా అన్ని గ్రామాల నుంచి వచ్చిన గిరిజను లు గురువారం సాయంత్రానికి కొత్తవలస చేరుకున్నారు. వీరికి కొత్తవలస వాసులు వసతి ఏర్పాట్లు చేశారు. శుక్రవారం ఉదయం 9 గంటలకు మంగళపాలెం గ్రామంలోని ట్రస్టు కార్యాలయం నుంచి ప్రారంభమై మధ్యాహ్నం 12 గంటలకు సింహాచలం కొండపైకి చేరుకున్నారు. వీరందరికీ ముందుగా స్వామి వారి దర్శనం కల్పించారు. అనంతరం అక్కడ నుంచి తిరుగు ప్రయాణమయ్యారు.

Updated Date - Jul 25 , 2026 | 12:35 AM