Share News

PACS వాణిజ్య బ్యాంకుల స్థాయికి పీఏసీఎస్‌లు ఎదగాలి

ABN , Publish Date - Jun 24 , 2026 | 12:09 AM

PACS Should Grow to the Level of Commercial Banks జిల్లాలోని వాణిజ్య బ్యాంకుల స్థాయికి సహకార సంఘాలు ఎదగాలని, ఆ దిశగా కృషి చేయాలని ఇన్‌చార్జి జాయింట్‌ కలెక్టర్‌ హేమలత సూచిం చారు. మంగళవారం కలెక్టరేట్‌లో ప్రత్యేక జిల్లా కో-ఆపరేటివ్‌ డెవలప్‌మెంట్‌ కమిటీ సమావేశం నిర్వహించారు.

PACS   వాణిజ్య బ్యాంకుల స్థాయికి  పీఏసీఎస్‌లు ఎదగాలి
సమావేశంలో మాట్లాడుతున్న ఇన్‌చార్జి జేసీ హేమలత

పార్వతీపురం, జూన్‌23(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని వాణిజ్య బ్యాంకుల స్థాయికి సహకార సంఘాలు ఎదగాలని, ఆ దిశగా కృషి చేయాలని ఇన్‌చార్జి జాయింట్‌ కలెక్టర్‌ హేమలత సూచిం చారు. మంగళవారం కలెక్టరేట్‌లో ప్రత్యేక జిల్లా కో-ఆపరేటివ్‌ డెవలప్‌మెంట్‌ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పీఏసీఎస్‌లను కమర్షియల్‌ బ్యాంకుల స్థాయికి తీసుకొచ్చేలా ఒక పరిణామ ప్రక్రియ నడుస్తుందని, దానిని మరింత బలోపేతం చేయాలని కోరారు. ఆన్‌లైన్‌ చెల్లింపుల ప్ర క్రియను మరింత వేగవంతం చేయాలన్నారు. ఈవోడీ కార్యకలాపాల్లో 98 శాతం పురోగతి సాధించి రాష్ట్రంలోనే పార్వతీపురం మన్యం ప్రథమ స్థానంలో నిలిచిందని తెలిపారు. కొన్ని సొసైటీలలో ఉన్న సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించు కోవాలని ఆదేశించారు. సమగ్రమైన బిజినెన్‌ డెవలప్‌మెంట్‌ ప్లాన్స్‌ రూపొందించాలన్నారు. ఈ ప్లాన్స్‌ పక్కాగా ఉంటేనే భవిష్యత్తులో కనీసం 60 శాతం ప్రగతితో ముందుకు వెళ్లగలమని అభి ప్రాయపడ్డారు. వినూత్న పద్ధతుల్లో ప్లాన్స్‌ అమలుకు డీసీసీబీ ద్వారా ఆర్థిక సహాయం అందిం చేలా చర్యలు తీసుకోవాలన్నారు. పీఏసీఎస్‌ల బలోపేతం కంప్యూటరైజేషన్‌, హెచ్‌ఆర్‌ఎంఎస్‌ పోర్టల్‌ అప్‌డేట్స్‌ వంటి అంశాలపై చేపట్టబోతున్న చర్యలను జిల్లా సహకార అధికారి కన్వీనర్‌ ఎం.వాణిశైలజ వివరించారు. ఈ సమావేశంలో నాబార్డు డీడీఎం ఎన్‌.దినేష్‌కుమార్‌రెడ్డి, శ్రీకాకుళం, విజయనగరం డీసీసీబీ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Jun 24 , 2026 | 12:09 AM