over raining జలమయం
ABN , Publish Date - Sep 24 , 2026 | 12:43 AM
over raining మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు జిల్లా జలమయం అయింది. నదులు, వాగులు పొంగుతున్నాయి. తీరంలో సముద్రం ఉధృతంగా ఉంది. కెరటాలు పెద్ద శబ్ధం చేస్తూ తీరాన్ని తాకుతున్నాయి. బుధవారం సాయంత్రం నుంచి గాలుల తీవ్రత పెరిగింది. వాటి దాటికి చాలా చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
జలమయం
జిల్లా అంతటా భారీ వర్షం
12.2 మిల్లీమీటర్ల నమోదు
గరిష్ఠంగా గుర్ల మండలంలో 81.2మీమీ
వ్యవసాయ పనులు ముమ్మరం
నేడు కూడా పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు సెలవు
లోతట్టు ప్రాంతీయులు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలి: మంత్రి, కలెక్టర్
విజయనగరం సెప్టెంబరు 23, (ఆంధ్రజ్యోతి):
మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు జిల్లా జలమయం అయింది. నదులు, వాగులు పొంగుతున్నాయి. తీరంలో సముద్రం ఉధృతంగా ఉంది. కెరటాలు పెద్ద శబ్ధం చేస్తూ తీరాన్ని తాకుతున్నాయి. బుధవారం సాయంత్రం నుంచి గాలుల తీవ్రత పెరిగింది. వాటి దాటికి చాలా చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. తీరం సమీప మండలాల్లో అంధకారం అలముకుంది. బుధవారం సాయంత్రం ఆరుగంటల సమయానికి 12.2మిల్లీమీటర్ల వర్షపాతం నమోదుకాగా అత్యధికంగా గుర్ల మండలంలో 81.2, అత్యల్పంగా సంతకవిటి మండలంలో 60మీ.మీ వర్షపాతం నమోదైంది. ఆండ్ర, మడ్డువలస, నారాయణపురం, తాటిపూడి జలాశయాల్లో ఆశించిన స్థాయిలో నీరుచేరింది. దీంతో రైతాంగానికి ఊరట కలిగింది. మిగతావారు కూడా ఉబాలు పనులు పూర్తి చేసేందుకు సిద్ధమయ్యారు. డెంకాడ మండలం గొడ్డుపాలెం పాలగడ్డ మినీ రిజర్వాయర్ పొంగింది. దీంతో అధికారులు వరదనీరు సజావుగా వెళ్లేందుకు చర్యలు తీసుకున్నారు. కలెక్టరేట్‌తో పాటు మండల కేంద్రాల్లో తుఫాన్ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కలెక్టర్ రామసుందర రెడ్డి, ఎస్పీ ఏఆర్ దామోదర్‌తో పాటు డీఆర్వో, ఆర్డీఓలు, తహసీల్దార్లు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ తుఫాన్ ప్రభావాన్ని ప్రభుత్వానికి నివేదిస్తున్నారు. ప్రమాదకరమైన భవనాల్లో ఉన్నవారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
అలసత్వం వద్దు
మంత్రి కొండపల్లి శ్రీనివాస్
తుఫాన్ తీరం దాటే వరకు ఎవ్వరూ అలసత్వం ప్రదర్శించవద్దని, అధికారులు రక్షణ చర్యలకు సిద్ధంగా ఉండాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఓ ప్రకటనలో అధికారులను ఆదేశించారు. తుఫాన్ ప్రభావం గురువారం కూడా ఉంటుందని పేర్కొన్నారు. తీవ్రతను ఎప్పటికప్పుడు అంచనా వేయాలని, ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
అప్రమత్తంగా ఉండాలి
జిల్లాలో మరింతగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈదురుగాలులు పెరుగుతున్నందున జిల్లా అధికారులు, సిబ్బంది, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అత్యవసరం ఉంటే తప్ప ప్రజలు బయటకు రావొద్దు.
కలెక్టర్ రామసుందర రెడ్డి
బుధవారం వర్షపాతం వివరాలు
మండలం వర్షపాతం
గుర్ల 81.2
డెంకాడ 78.0
విజయనగరం 77.8
రామభద్రాపురం 75
గజపతినగరం 71.2
గంట్యాడ 69.8
బొబ్బిలి.. 67.4
గరివిడి 67,0
మెంటాడ 63.4
బొండపల్లి 66.0
సంతకవిటి 60.0
చీపురుపల్లి 59.4
వంగర 58.4
దత్తిరాజేరు 55.4
తెర్లాం 54.8
రాజాం 54.5
రేగిడి 43.0
==================