Share News

అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల వినతి

ABN , Publish Date - Mar 02 , 2026 | 12:28 AM

అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు తమ సమస్యలను పరి ష్కరించాలని కోరుతూ ఎమ్మెల్యే అదితి గజపతి రాజుకు ఆదివారం విజయనగరంలోని తన క్యాంపు కార్యాలయంలో వినతిపత్రం అందించారు.

 అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల వినతి

విజయనగరం రూరల్‌, మార్చి 1(ఆంధ్రజ్యోతి): అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు తమ సమస్యలను పరి ష్కరించాలని కోరుతూ ఎమ్మెల్యే అదితి గజపతి రాజుకు ఆదివారం విజయనగరంలోని తన క్యాంపు కార్యాలయంలో వినతిపత్రం అందించారు. తమ సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించాలని కోరారు. అలాగే ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏపీటీఎఫ్‌ ఉద్యోగ సంఘ నాయకులు ఎమ్మెల్యేకు వినతిపత్రం అందించారు.

రహదారుల అభివృద్ధికి నిధులు విడుదల

విజయనగరం మండల పరిధిలోని 7 రహదారుల (15.068 కిలోమీటర్లు) నిర్మాణానికి రూ.7కోట్ల 67లక్ష లు ప్రభుత్వం విడుదల చేసిందని ఎమ్మెల్యే అదితి గజపతిరాజు చెప్పారు. ఆమె ఆదివారం స్థానిక విలేకర్ల తో మాట్లాడారు. ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అం దించే లక్ష్యంతో ఈ నిధులను ఆయా రోడ్లకు కేటాయిం చినట్టు తెలిపారు. ఆయా రోడ్ల పనులు త్వరలో ప్రారం భం కానున్నాయన్నారు.

Updated Date - Mar 02 , 2026 | 12:28 AM