మా ఓట్లు తొలగించారు
ABN , Publish Date - Jul 22 , 2026 | 12:03 AM
నందబలగ గ్రామంలో టీడీపీకి చెందిన ఓట్ల ను తొలగించారని గ్రామానికి చెందిన పార్టీ నాయకులు చింతగుంట డిల్లేశ్వరరా వు, చింతగుంట శ్రీనివాస్, రమణ, అప్పలరాజు తదితరులు మంగళవారం స్థానిక తహసీల్దార్ ఎం.రాజశేఖర్‌కు ఫిర్యాదు చేశారు.
నందబలగ గ్రామస్థుల ఫిర్యాదు
రాజాం, జూలై 21(ఆంధ్రజ్యోతి): నందబలగ గ్రామంలో టీడీపీకి చెందిన ఓట్ల ను తొలగించారని గ్రామానికి చెందిన పార్టీ నాయకులు చింతగుంట డిల్లేశ్వరరా వు, చింతగుంట శ్రీనివాస్, రమణ, అప్పలరాజు తదితరులు మంగళవారం స్థానిక తహసీల్దార్ ఎం.రాజశేఖర్‌కు ఫిర్యాదు చేశారు. ఓట్లు తొలగించడానికి ఎవరికీ ఎటువంటి హక్కు లేదని.. పూర్తిస్థాయిలో పరిశీలించి, న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ హామీ ఇచ్చారు. అనంతరం వారు కలెక్టర్ కార్యాల యానికి వెళ్లి, కలెక్టర్‌ను కలిసి ఓట్లు తొలగింపుపై ఫిర్యాదు చేశారు. కలెక్టర్ స్పం దించి.. నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఫోన్ చేసి, తొలగించిన ఓట్లు అర్హులా.. కాదా.. అనే విషయంపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి, నివేదిక అందిం చాలని ఆదేశించారు. గ్రామంలో లేని వారి ఓట్లను, వివాహమై వెళ్లిపోయిన వారి ఓట్లను, మరణించిన వారి ఓట్లను తొలగించకుండా.. గ్రామంలో నివాసం ఉంటు న్న వారి ఓట్లను తొలగించడానికి వైసీపీ నాయకులు కుట్రలు చేస్తున్నారని, ఈ విషయంలో తగిన న్యాయం చేయాలని వారు కలెక్టర్‌ను కోరారు.