Share News

సామాజిక తనిఖీలో రూ.4.45 లక్షల రికవరీకి ఆదేశం

ABN , Publish Date - Jan 28 , 2026 | 12:23 AM

మండలంలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి చేపట్టిన ఉపాధిహామీ పనులపై వేపాడలో జిల్లా పథక సంచాలకురాలు శారదాదేవి ఆధ్వర్యంలో మంగళవారం సామాజిక తనిఖీ నిర్వహించారు.

సామాజిక తనిఖీలో రూ.4.45 లక్షల రికవరీకి ఆదేశం

వేపాడ, జనవరి 27(ఆంధ్రజ్యోతి): మండలంలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి చేపట్టిన ఉపాధిహామీ పనులపై వేపాడలో జిల్లా పథక సంచాలకురాలు శారదాదేవి ఆధ్వర్యంలో మంగళవారం సామాజిక తనిఖీ నిర్వహించారు. మండలంలోని 29 పంచాయతీల్లో ఉపాధి పనులకుగాను మొత్తం రూ.18కోట్ల 36లక్షల 75వేల 902 ఖర్చు చేసినట్టు తెలిపారు. ఈ తనిఖీల్లో మెటీరియల్‌ పనులకు సంబంధించి రూ.లక్షా 35వేలు, వేతనదారులకు చెల్లించే మస్తర్ల సొమ్ములో రూ.3లక్షల 15వేలు అక్రమాలు జరిగినట్టు గుర్తించి మొత్తం రూ.4లక్షల 45వేలు రికవరీ చేయాలని ఆమె అధికారులను ఆదేశిం చారు. ఈ సమావేశంలో జడ్పీటీసీ మండల సభ్యుడు శానాపతి అప్పారావు, సామాజిక తనిఖీ డీవీవో పి.వెంకటరమణ, బానుజీరావు, సీనియర్‌ అసిస్టెంట్లు ఎన్‌.నారాయణరావు, అంబుడ్స్‌మెన్‌ ఎంఎ.యాకుబ్‌భాషా, ఎంపీడీవో సీహెచ్‌ సూర్యనారాయణ, ఎస్‌ఆర్‌పీ సూర్యనారయణ, డీఆర్‌పీలు పాల్గొన్నారు.

Updated Date - Jan 28 , 2026 | 12:23 AM