Share News

రూ. 6.42 లక్షల రికవరీకి ఆదేశం

ABN , Publish Date - Mar 12 , 2026 | 12:09 AM

ఉపాధి హామీ పనుల్లో లోపాలను గుర్తించిన డ్వామా పీడీ రామచంద్రరావు రూ. 6.42 లక్షల రికవరీకి ఆదేశిం చారు.

రూ. 6.42 లక్షల రికవరీకి ఆదేశం
పనుల వివరాలు చెబుతున్న డీఆర్‌పీ

సాలూరు రూరల్‌, మార్చి 11 (ఆంధ్రజ్యోతి ): ఉపాధి హామీ పనుల్లో లోపాలను గుర్తించిన డ్వామా పీడీ రామచంద్రరావు రూ. 6.42 లక్షల రికవరీకి ఆదేశిం చారు. బుధవారం స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో 2024-2025 ఆర్థిక సంవత్సరంలో చేపట్టిన 2751 పనులు, పంచాయతీరాజ్‌లో జరిగిన 48 పనులు, ఐటీడీఏలో జరిగిన 10 పనులపై సామాజిక ఆడిట్‌ నిర్వహిం చారు. రూ. 29కోట్ల, 97 లక్షల, 20 వేల 732 పనులపై గత నెల ఒకటి నుంచి ఈ నెల 10 వర ఎస్‌ఆర్‌పీ ఈదిబిల్లి పున్నపునాయుడు ఆధ్వర్యంలో ముగ్గురు డీఆర్‌పీలు 29 పంచాయతీల్లో పరిశీలన చేశారు. ఈ పనులపై గ్రామసభలను నిర్వహించారు. అనంతరం జరిగిన ప్రజావేదికలో పనుల్లో లోపాలన భద్ర, పట్టుచెన్నారు, పగులుచెన్నారు, నార్లవలస, కురుకూటి తదితర పంచాయతీల్లో ఉద్యానవన పథకం కింద రైతులకు ఇచ్చిన మొక్క ల ఆచూకీ కరువైనట్టు గుర్తించారు. అలాగే పనుల్లో కొలతలు, క్యూబిక్‌ మీటర్ల నమోదులో లోపాలు, మస్తర్లులో దిద్దుబాట్టు ఉన్నట్లు తెలుసు కున్నారు. ఆయా లోపాలపై పీడీ రామచంద్రరావు రూ. 6.42 లక్షల రికవరీ టకి ఆదేశించారు. కార్యక్రమంలో ఏపీడీలు త్రివిక్రమరావు, శ్రీహరి, విజిలెన్స్‌ అధికారి వెంకటరమణ, డిప్యూటీ ఎంపీడీవో రామలక్ష్మి, ఏపీవో టి.రామకృష్ణ పాల్గొన్నారు.

Updated Date - Mar 12 , 2026 | 12:09 AM