Share News

Crops తక్కువ నీటితో సాగయ్యే పంటలే వేయాలి

ABN , Publish Date - Aug 02 , 2026 | 11:44 PM

Opt for Low Water-Intensive Crops ఎల్‌నినో నేపథ్యంలో రైతులు తక్కువ నీటితో సాగయ్యే పంటలను వేసుకోవాలని ఆచార్య ఎన్‌జీరంగా వ్యవసాయ విశ్వవిద్యా లయం వైస్‌ చాన్సలర్‌ పీవీ సత్యనారాయణ సూచించారు. వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నందున ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారించాలన్నారు.

 Crops తక్కువ నీటితో సాగయ్యే పంటలే వేయాలి
రైతులకు అవగాహన కల్పిస్తున్న వీసీ సత్యనారాయణ

పార్వతీపురం రూరల్‌/పాలకొండ, ఆగస్టు 2(ఆంధ్రజ్యోతి): ఎల్‌నినో నేపథ్యంలో రైతులు తక్కువ నీటితో సాగయ్యే పంటలను వేసుకోవాలని ఆచార్య ఎన్‌జీరంగా వ్యవసాయ విశ్వవిద్యా లయం వైస్‌ చాన్సలర్‌ పీవీ సత్యనారాయణ సూచించారు. వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నందున ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారించాలన్నారు. పార్వతీపురం, పాలకొండ మండలాల్లోని సుడిగ, తంపటాపల్లి గ్రామాల్లో ఆదివారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా పంట పొలాలను పరిశీలించి రైతులకు పలు సూచనలిచ్చారు. సాగునీటిని సమర్థంగా వినియోగిం చుకోవాలని, వ్యవసాయశాఖాధికారులు, శాస్త్రవేత్తల సలహాలను పాటించాలని తెలిపారు. ఈ నెలలో మంచి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. అధిక ఎండలు, సాగునీరు అందని కారణంగా నారుమడులు, ఎదలు ఎండిపోతున్నాయని పలువురు రైతులు తెలిపారు. ఒక్కోసారి అధిక వర్షాలకు పొలాలు ముంపునకు గురవుతున్నాయని తంపటాపల్లి వాసులు వాపోయారు. కాగా ఈ గ్రామాన్ని దత్తత తీసుకోవాలని సీతంపేట వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త పి.వెంకటరావును వీసీ సూచించారు. తోటపల్లి ఎడమ కాలువ ఆధునికీకరణ జరగకపోవడంతో శివారు ప్రాంతాలకు నీరు అందడం లేదని అభ్యుదయ రైతు ఖండాపు ప్రసాదరావు తెలిపారు. అనంతరం నారును రక్షించుకునే విధానాలను రాగోలు వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త ఉదయ్‌బాబు వివరించారు. ఈ పరిశీలనలో డీఈవో భవానీ శంకర్‌, వ్యవసాయశాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 02 , 2026 | 11:44 PM