‘సర్వీసులు నిర్వహించే అవకాశం ఇవ్వాలి’
ABN , Publish Date - Aug 19 , 2026 | 12:12 AM
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్ర యంలో స్థానిక టాక్సీ డ్రైవర్లు, వాహన యజమానులకు టాక్సీ సర్వీసులు నిర్వ హించుకొనే అవకావం కల్పించాలని స్థానిక టాక్సీ డ్రైవర్లు కోరారు.
భోగాపురం, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): భోగాపురం అంతర్జాతీయ విమానాశ్ర యంలో స్థానిక టాక్సీ డ్రైవర్లు, వాహన యజమానులకు టాక్సీ సర్వీసులు నిర్వ హించుకొనే అవకావం కల్పించాలని స్థానిక టాక్సీ డ్రైవర్లు కోరారు. మంగళ వారం భోగాపురం స్టేషన్‌లో ఎస్‌ఐ దామోదరరావుకి వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా టాక్సీ డ్రైవర్లు మాట్లాడుతూ స్థానికంగా కొద్దేళ్లుగా టాక్సీ డ్రైవిం గ్‌నే ఆధారంగా చేసుకొని జీవిస్తున్నామన్నారు. ఉన్న భూములు ఎయిర్‌పోర్టుకి ఇచ్చేశమని, ఎయిర్‌పోర్టు ద్వారా కలిగే ఉపాధి అవకావాల్లో స్థానికులకు అవకా శం ఇవ్వాలని కోరారు. విమానశ్రయం పరిధిలో స్థానికులను ఆదుకొనేలా టాక్సీస్టాండు ఏర్పాటుచేయాలని స్థానిక టాక్సీ డ్రైవర్లు కోరారు. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లనున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. కార్యక్రమంలో కె. రాము, శివాజి, కె.నాయుడు, ఎన్.ఆనంద్, యు.రాంబాబు పాల్గొన్నారు.