Share News

Opportunities for aspirants ఆశావహులకు అవకాశాలు

ABN , Publish Date - May 21 , 2026 | 11:49 PM

Opportunities for aspirants డివిజన్ల పెంపుతో నగరం రాజకీయంగా కొత్తరూపును సంతరించుకోనుంది. కొత్త నాయకులు తెరపైకి రానున్నారు. ఆయా పార్టీల సీనియర్‌ కార్యకర్తలు ఇప్పటి నుంచే ఆలోచనలో పడ్డారు. పెద్దలను కలుస్తూ తమ ఆసక్తిని తెలియజేస్తున్నారు. నగరంలో భౌతికంగా ఎటువంటి మార్పులు లేకపోయినప్పటికీ డివిజన్ల పునర్విభజనతో జనాభా అటు ఇటు సర్దుబాటు కానున్నారు. ఇప్పటివరకూ 50 డివిజన్లు ఉన్న విషయం తెలిసిందే. వాటిని 62కు పెంచుతూ అధికారులు ఇటీవల ముసాయిదా విడుదల చేశారు.

Opportunities for aspirants ఆశావహులకు అవకాశాలు
విజయనగరం కార్పొరేషన్‌ కార్యాలయం

ఆశావహులకు అవకాశాలు

పునర్విభజనతో మారబోతున్న రూపురేఖలు

50 నుండి 62 డివిజన్లకు పెంపు

అభ్యంతరాలకు ఆరురోజులు గడువు

నేటివరకూ రాని రాని అభ్యంతరాలు

విజయనగరంటౌన్‌, మే21(ఆంధ్రజ్యోతి): డివిజన్ల పెంపుతో నగరం రాజకీయంగా కొత్తరూపును సంతరించుకోనుంది. కొత్త నాయకులు తెరపైకి రానున్నారు. ఆయా పార్టీల సీనియర్‌ కార్యకర్తలు ఇప్పటి నుంచే ఆలోచనలో పడ్డారు. పెద్దలను కలుస్తూ తమ ఆసక్తిని తెలియజేస్తున్నారు. నగరంలో భౌతికంగా ఎటువంటి మార్పులు లేకపోయినప్పటికీ డివిజన్ల పునర్విభజనతో జనాభా అటు ఇటు సర్దుబాటు కానున్నారు. ఇప్పటివరకూ 50 డివిజన్లు ఉన్న విషయం తెలిసిందే. వాటిని 62కు పెంచుతూ అధికారులు ఇటీవల ముసాయిదా విడుదల చేశారు. ఆ ప్రతులను 61 సచివాలయాల్లోనూ నోటీస్‌బోర్డులో పెట్టారు. పురవాసులు వాటిని పరిశీలించి ఏమైనా మార్పులు, చేర్పులు, సలహాలు, సూచనలు ఉంటే అధికారులకు తెలియజేయవచ్చు.

నగరపాలక సంస్థ పరిధిలో 2011 జనాభా లెక్కల ప్రకారం 2లక్షల44వేల586మంది నివాసం ఉంటున్నారు. వీరంతా కొత్త డివిజన్లలో సర్దుబాటు కానున్నారు. ఆ మేరకు ఒక్కో డివిజన్‌కు దాదాపు 4వేల మంది చొప్పున జనాభా ఉండే అవకాశం ఉంది. ప్రతీ డివిజన్‌లోనూ 3,500మందికి తగ్గకుండా ఉండేలా చూస్తున్నారు. పునర్విభజనలో భాగంగా డివిజన్‌.. డివిజన్‌కు కనెక్టవిటీ స్పష్టంగా ఉండేలా చూడాలన్నది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాల్లో ఒకటి. డోర్‌ నెంబర్ల ఆధారంగా ఈకనెక్టవిటీని ఏర్పాటు చేసేందుకు అధికారులు ప్రయత్నించారు. కాగా డివిజన్ల హద్దులు నిర్ణయిస్తూ ముసాయిదా విడుదలై మూడు రోజులైంది. ఇప్పటివరకూ అధికారులకు ఒక్క అభ్యంతరం కూడా రాలేదు. ఇంకా ఐదురోజులు గడువు ఉంది. అభ్యంతరాలు రాకుంటే అధికారులు విడుదల చేసిన ముసాయిదానే ఆమోదిస్తారు. ఆ ప్రకారమే ఎన్నికలు నిర్వహిస్తారు. తుది ముసాయిదాను కలెక్టర్‌ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిస్తారు.

ఫ నగరంలో పెరిగిన నూతన డివిజన్లపై స్థానిక రాజకీయ నాయకులు మల్లగుల్లాలు పడుతున్నారు. తమకు అనుకూలంగా ఉండే వీధులు, ప్రజలు వేరే డివిజన్‌లోకి మారిపోవడం జరిగిందంటూ కొంతమంది బోరుమంటున్నారు. దీనికి సంబంధించి మార్పులు చేర్పులు ఇతర సలహాలపై జిల్లా స్థాయి నాయకుల ఇళ్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.

- డివిజన్ల పునర్విభజనతో త్వరలో జరగనున్న కార్పొరేషన్‌ ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీల నుంచి పోటీచేసే అభ్యర్థుల సంఖ్య పెరుగుతుంది. కొత్త నాయకులకు అవకాశాలు వస్తాయి. మహిళా రిజర్వేషన్లు పెరిగే అవకాశం లేకపోలేదు. ఆయా డివిజన్లలో పోటీచేసేందుకు కూటమి ప్రభుత్వంలో ఆశావహులు ఇప్పటినుండే హల్‌చల్‌ చేస్తున్నట్లు సమాచారం.

Updated Date - May 21 , 2026 | 11:49 PM