Share News

Open School Supplementary 25 నుంచి ఓపెన్‌ స్కూల్‌ సప్లిమెంటరీ పరీక్షలు

ABN , Publish Date - May 23 , 2026 | 12:29 AM

Open School Supplementary Exams from 25th ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ ఆధ్వర్యంలో ఈనెల 25 నుంచి టెన్త్‌, ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్‌డ్‌, సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయని డీఆర్వో హేమలత తెలిపారు.

Open School Supplementary    25 నుంచి ఓపెన్‌ స్కూల్‌ సప్లిమెంటరీ పరీక్షలు
సమావేశంలో మాట్లాడుతున్న డీఆర్వో హేమలత

బెలగాం, మే22(ఆంధ్రజ్యోతి): ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ ఆధ్వర్యంలో ఈనెల 25 నుంచి టెన్త్‌, ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్‌డ్‌, సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయని డీఆర్వో హేమలత తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు నిర్వహించాలన్నారు. రెవెన్యూ, పోలీస్‌, విద్యా శాఖలు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. ఈ నెల 25 నుంచి జూన్‌ 1 వరకు నాలుగు కేంద్రాల్లో ఈ పరీక్షలు జరగుతాయని, జిల్లా వ్యాప్తంగా 269 మంది విద్యార్థులు హాజరు కాను న్నారని తెలిపారు. టెన్త్‌ పరీక్షలకు 200 మంది, ఇంటర్‌ పరీక్షలకు 69 మంది హాజరవుతారని వెల్లడించారు. ఈ సమావేశంలో డీఈవో బ్రహ్మాజీరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 23 , 2026 | 12:29 AM