Share News

ఓపీ మరింత పెంచాలి: ఆర్జేడీ

ABN , Publish Date - Feb 26 , 2026 | 12:04 AM

ఆయుర్వేద వైద్యం ప్రజలకు మరింత చేరువచేయాలని, డిస్పెన్షరీల్లో ఓపీ మరింత పెంచాలని విశాఖపట్నం జోన్‌-1 ఆయుర్వేద రీజినల్‌ డిప్యుటీ డైరెక్టర్‌ కయ్యపు శ్రీనివాసులు కోరారు.

 ఓపీ మరింత పెంచాలి: ఆర్జేడీ
డిస్పెన్సరీలో మందుల స్టాక్‌ను పరిశీలిస్తున్న శ్రీనివాసులు

రేగిడి, ఫిబ్రవరి 25,(ఆంధ్రజ్యోతి): ఆయుర్వేద వైద్యం ప్రజలకు మరింత చేరువచేయాలని, డిస్పెన్షరీల్లో ఓపీ మరింత పెంచాలని విశాఖపట్నం జోన్‌-1 ఆయుర్వేద రీజినల్‌ డిప్యుటీ డైరెక్టర్‌ కయ్యపు శ్రీనివాసులు కోరారు. బుధవారం ఖండ్యాం ఆయుర్వేద డిస్పెన్షరీని తనిఖీచేశారు. డిస్పెన్షరీలో ఓపి, అందుతున్న సేవలను ఆరాతీసి, మందుల స్టాక్‌, సిబ్బంది హాజరు రికారు లను పరిశీలించారు. ప్రస్తుతం ఉన్న ఓపీ సంఖ్యను మరింత పెంచాలని, ప్రాచీన ఆయర్వేద వైద్యంపై ప్రజల్లో విశ్వాసం ఉండేలా సేవలు ఉం డాలని వైద్యాధికా రి సునీల్‌కుమార్‌ ను ఆదేశించారు.

Updated Date - Feb 26 , 2026 | 12:04 AM