Share News

OP ఓపీ 402

ABN , Publish Date - Mar 23 , 2026 | 11:10 PM

OP 402 సీతంపేట ఏరియా ఆసుపత్రి సోమవారం రోగులతో కిక్కిరిసింది. దీంతో 402 వరకు ఓపీ నమోదైంది. ఓపీ నమోదు కౌంటర్‌, రక్తపరీక్షల ల్యాబ్‌లు రోగులు, వారి బంధువులతో కిటకిటలాడాయి.

 OP  ఓపీ 402
సీతంపేట ఏరియా ఆసుపత్రిలో ఓపీ కౌంటర్‌ వద్ద పరిస్థితి ఇదీ..

సీతంపేట రూరల్‌, మార్చి23(ఆంధ్రజ్యోతి): సీతంపేట ఏరియా ఆసుపత్రి సోమవారం రోగులతో కిక్కిరిసింది. దీంతో 402 వరకు ఓపీ నమోదైంది. ఓపీ నమోదు కౌంటర్‌, రక్తపరీక్షల ల్యాబ్‌లు రోగులు, వారి బంధువులతో కిటకిటలాడాయి. జ్వరం, వాంతులు, తలనొప్పి, ఒళ్లునొప్పులు వంటి సమస్యలతో వివిధ ప్రాంతాల నుంచి భారీగా ప్రజలు తరలివచ్చారు. వారిలో 32మంది ఆసుపత్రిలో ఇన్‌పేషెంట్లుగా చేరారు. ఎవరికీ ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టామని, అందరికీ మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నామని ఏరియా ఆసుపత్రి సూపరింటెం డెంట్‌ బి.శ్రీనివాసరావు చెప్పారు. వార్డుల్లో బెడ్లను కూడా రోగులకు అందుబాటులో తెచ్చామని తెలిపారు.

Updated Date - Mar 23 , 2026 | 11:10 PM