Share News

One Nurse ఆ పీహెచ్‌లో ఒకరే నర్సు

ABN , Publish Date - Sep 02 , 2026 | 12:15 AM

Only One Nurse at That PHC భామిని పీహెచ్‌సీని స్టాఫ్‌ కొరత వేధిస్తోంది. దీంతో ఇక్కడున్న ఒక్క నర్స్‌ రోజుకు 14 గంటల పాటు ఏకధాటిగా డ్యూటీ చేయాల్సి వస్తోంది.

  One Nurse   ఆ పీహెచ్‌లో ఒకరే నర్సు
మంగళవారం రాత్రి 7 గంటల సమయంలో పీహెచ్‌సీలో ఒంటరిగా డ్యూటీ చేస్తున్న నర్సు

భామిని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సిబ్బంది కొరత

భామిని, సెప్టెంబరు 1 (ఆంధ్రజ్యోతి): భామిని పీహెచ్‌సీని స్టాఫ్‌ కొరత వేధిస్తోంది. దీంతో ఇక్కడున్న ఒక్క నర్స్‌ రోజుకు 14 గంటల పాటు ఏకధాటిగా డ్యూటీ చేయాల్సి వస్తోంది. వివరాల్లోకి వెళ్తే.. వాస్తవంగా భామిని పీహెచ్‌సీలో ముగ్గురు నర్సులు ఉండాలి. అయితే ఇక్కడ ఇద్దరే పనిచేస్తున్నారు. వారిలో ఒకరు గత నెల ప్రారంభంలో ప్రసూతి సెలవులో వెళ్లారు. దీంతో ఎన్‌హెచ్‌ఎం కాంట్రాక్ట్‌ నర్సు భవానీ గత నెల రోజులుగా సెలవు లేకుండా పనిచేస్తున్నారు. రోజూ సాయంత్రం 6 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 8 వరకు విధులు నిర్వహిస్తున్నారు. రాత్రివేళ 25 నుంచి 30 మంది వరకు అత్యవసర రోగులు వస్తుంటారని, పిల్లల సంరక్షణ కూడా కష్టంగా మారిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. రోజూ రాత్రి వేళల్లో తనతో పాటు లేడీ వాచ్‌మన్‌ మాత్రమే ఆసుపత్రిలో ఉంటున్నామని తెలిపారు. దీనిపై పీహెచ్‌సీ వైద్యాధికారి భార్గవనాయుడును వివరణ కోరగా.. ఈ సమస్యను ఉన్నతాధికారులు దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. కాగా మండలంలోని బత్తిలి, బాలేరు పీహెచ్‌సీల్లోనూ నర్సుల కొరత ఉందని, తక్షణమే సిబ్బందిని నియమించాలని స్థానికులు కోరుతున్నారు.

Updated Date - Sep 02 , 2026 | 12:15 AM