Fields Covered 20 శాతం పొలాల్లోనే..
ABN , Publish Date - Mar 06 , 2026 | 11:42 PM
Only 20% of Fields Covered జిల్లాలో పత్తి సీసీఐ (కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ) మద్దతు ధరకు కొనుగోలు చేసి రైతులను ఆదుకుంది. అయితే ఇంకా 20 శాతం పంట పొలాల్లో మిగిలి ఉంది. దీంతో ఇదే అదునుగా వ్యాపారులు ధర తగ్గిస్తుండగా.. వేరే దారి లేక రైతులు నష్టానికై పంటను వారికి విక్రయిస్తున్నారు.
ఆలస్యంగా కాపు రావడంతో ఇబ్బందులు
తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్న వ్యాపారులు
నష్టపోతున్న రైతులు
అధికారులు స్పందించాలని విన్నపం
సాలూరు రూరల్, మార్చి6(ఆంధ్రజ్యోతి): జిల్లాలో పత్తి సీసీఐ (కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ) మద్దతు ధరకు కొనుగోలు చేసి రైతులను ఆదుకుంది. అయితే ఇంకా 20 శాతం పంట పొలాల్లో మిగిలి ఉంది. దీంతో ఇదే అదునుగా వ్యాపారులు ధర తగ్గిస్తుండగా.. వేరే దారి లేక రైతులు నష్టానికై పంటను వారికి విక్రయిస్తున్నారు.
వాస్తవంగా జిల్లాలో నాలుగు వేల ఎకరాల్లో పత్తి సాగయ్యింది. అయితే ఈ ఏడాది దిగుబడి తగ్గింది. ఈ మేరకు ప్రజాప్రతినిఽధలు, అధికారుల ప్రత్యేక చొరవతో సాలూరు, భామినిల్లో రెండు సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. వాటి ద్వారా క్వింటా పత్తికి రూ. 8,110 మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేశారు. సాలూరు కేంద్రంలో నాలుగు వేల క్వింటాలుకు పైబడి, భామినిలో 4,300 క్వింటాళ్ల పత్తిని సీసీఐ కొనుగోలు చేసింది. ప్రస్తుతం కొనుగోలును నిలిపి వేసింది. అయితే జిల్లాలో ఇంకా 15 నుంచి 20 శాతం వరకు పత్తి పంట పొలాల్లో ఉంది. సీసీఐ కొనుగోలు నిలిపివేయడంతో పొలాల్లో మిగిలిన పత్తిని వ్యాపారులు ధర తగ్గించి కొనుగోలు చేస్తున్నారు. క్వింటాకు కేవలం రూ. 5,500 నుంచి రూ. 6000 మాత్రమే చెల్లిస్తున్నారు.
సాలూరు మండలంలో 1920 ఎకరాల్లో పత్తి సాగయ్యింది. ఇప్పటికీ బాగువలస, బోరబంద తదితర గ్రామాల్లో 384 ఎకరాల్లో పత్తి పొలాల్లోనే ఉంది. పాచిపెంట మండలంలో గడివలస, విశ్వనాథపురం, కూనంబందవలస తదితర గ్రామాల్లో ఇంకా కొద్దిమేర పత్తి పొలాల్లో ఉంది. మిగిలిన పత్తిని వ్యాపారులకే విక్రయించాల్సి ఉంది. ఈ తరుణంలో వ్యాపారులు ధర తగ్గించి కొనుగోలు చేస్తున్నారు. ఆలస్యంగా పత్తి కాపు రావడంతో చివరి పికింగ్‌లో ధర తగ్గడంతో నష్టపోతున్నామని రైతులు వాపోతున్నారు. మార్కెటింగ్ శాఖ అధికారులు చొరవ చూపి తగిన ధర వచ్చే విధంగా చూడాలని వారు కోరుతున్నారు.