Share News

ఆన్‌లైన్‌లో మందుల అమ్మకాలు నిలిపివేయాలి

ABN , Publish Date - May 21 , 2026 | 12:03 AM

ఆన్‌లైన్‌లో మందుల అమ్మకాలు నిలిపి వేయాలని మందుల షాపుల యజ మానులు కోరారు. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా దుకాణాల యజమానులు మందుల షాపులు మూతవేసి నిరసన తెలిపారు.

ఆన్‌లైన్‌లో మందుల అమ్మకాలు నిలిపివేయాలి
రాజాం రూరల్‌: ర్యాలీ చేస్తున్న మందులషాపుల యజమానులు :

ఆన్‌లైన్‌లో మందుల అమ్మకాలు నిలిపి వేయాలని మందుల షాపుల యజ మానులు కోరారు. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా దుకాణాల యజమానులు మందుల షాపులు మూతవేసి నిరసన తెలిపారు.

గజపతినగరం, మే 20 (ఆంధ్రజ్యోతి): పట్టణంలో బుధవారం మందుల షాపులు మూసివేశారు. అనంతరం నల్లబ్యాడ్జిలతో నిరసన తెలియజేసి తహసీల్దార్‌ కార్యా లయంలో సీనియర్‌ అసిస్టెంట్‌ గౌరునాయుడుకు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆన్‌లైన్‌లో అమ్మకాలు నిలిపివేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో అఖిల బారత కెమిస్టుల సమాఖ్య నియోజకవర్గ అధ్యక్ష, కార్యదర్శులు పీవీరమణారావు, పూసర్ల ఉమామహేశ్వరరావు, కేఏఎస్‌ గుప్తా పాల్గొన్నారు.

ఫ వేపాడ, మే 20 (ఆంధ్రజ్యోతి): ఎస్‌.కోట, వేపాడ, ఎల్‌.కోట మండలాలకు చెందిన మందుల షాపుల యజమానులు బుధవారం బంద్‌చేశారు. ఈ మేరకు యూనియన్‌ నాయకులు తహసీల్దార్‌ జె.రాములమ్మకు వినతిపత్రం అందజేశారు.

ఫ రాజాం రూరల్‌, మే 20 (ఆంధ్రజ్యోతి): ఆన్‌లైన్‌లో మందుల విక్రయాలను వెంటనే నిలిపివేయాలని రాజాం మెడికల్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు ఎస్‌.వెంకట రాజు (బాబు) డిమాండ్‌ చేశారు. ఆలిండియా ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ కెమిస్ట్స్‌, డ్రగ్గిస్ట్స్‌ (ఏఐఓసీడీ) పిలుపుమేరకు రాజాంలో మందుల షాపులను బుధవారం బంద్‌చేశారు. పట్టణంలోని అంబేడ్కర్‌ జంక్షన్‌ నుంచి తహసీల్దార్‌ కార్యాలయం వరకూ ర్యాలీ చేశారు. అనంతరం రాజాం తహసీల్దార్‌ రాజశేఖర్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో శ్రీధర్‌, గిరిరాజు, నారాయణరావు, వంశీకృష్ణ, శ్రీనివాసరావు పాల్గొన్నారు.

ఫ సంతకవిటి, మే 20 (ఆంధ్రజ్యోతి): మండలంలో మెడికల్‌ షాపు యజమానులు తమ సమస్యలను పరిష్కరించాలని డీటీ మధుకు బుధవారం వినతి పత్రం అం దించారు. కార్యక్రమంలో విజయనగరం జిల్లా కెమిస్టులు అండ్‌ డ్రగ్‌స్టుల అసోసి యేషన్‌ కార్యవర్గ సభ్యుడు అక్కరపోతు సత్యన్నారాయణ పాల్గొన్నారు.

Updated Date - May 21 , 2026 | 12:03 AM