గంజాయి కేసులో ఇద్దరికి ఏడాది జైలు
ABN , Publish Date - Oct 16 , 2026 | 12:37 AM
జిల్లాలోని రామభద్రపురం, గజపతి నగరం పోలీస్స్టేషన్ల పరిధిలో నమోదైన వేర్వేరు గంజాయి కేసుల్లో ఇద్దరు నిందితులకు ఏడాది కఠిన కారాగార శిక్షతో పాటు రూ.10వేలు జరిమానా విధి స్తూ మొదటి ఏడీజే, ఏన్డీపీఎస్ ప్రత్యేక న్యాయాధికారి విజయకల్యాణి గురువారం తీర్పు వెల్లడించినట్లు ఎస్పీ ఏఆర్ దామోదర్ తెలిపారు.
విజయనగరం, అక్టోబరు 15(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని రామభద్రపురం, గజపతి నగరం పోలీస్స్టేషన్ల పరిధిలో నమోదైన వేర్వేరు గంజాయి కేసుల్లో ఇద్దరు నిందితులకు ఏడాది కఠిన కారాగార శిక్షతో పాటు రూ.10వేలు జరిమానా విధి స్తూ మొదటి ఏడీజే, ఏన్డీపీఎస్ ప్రత్యేక న్యాయాధికారి విజయకల్యాణి గురువారం తీర్పు వెల్లడించినట్లు ఎస్పీ ఏఆర్ దామోదర్ తెలిపారు. గజపతినగరం మండలం మరుపల్లిలో నివాశముంటున్న పీతల శివ(23) చెడువ్యసానాలకు అలవాటు పడి ఒడిశా రాష్ట్రం రాయగడలో ఒక గుర్తుతెలియని వ్యక్తి నుంచి 5 కిలోల గంజాయి కొనుగోలు చేసి, గజపతినగరం పోలీసులకు 2023 మే4న పట్టు బడ్డాడు. అలాగే ఒడిశా రాష్ట్రం మల్కాన్గిరి బలిమల ప్రాంతానికి చెందిన రతన్ సగారియా(48) అనే వ్యక్తి 2.890 కిలోల గంజాయి తమ రాష్ట్రం నుంచి కరీంనగ ర్కు తరలిస్తుండగా 2020 జనవరి 29న రామభద్రాపురం పోలీస్లకు పట్టుబ డ్డాడు. ఈ రెండు కేసుల్లో పట్టుబడిన పీతల శివ, రతన్సగారియాపై నేరారోప ణలు కోర్టులో రుజువు కావటంతో ఏడాది జైలుశిక్ష తోపాటు జరిమానా విధిస్తూ న్యాయాధికారి తీర్పు వెల్లడించినట్టు ఎస్పీ తెలిపారు. ఈ కేసులో కీలకంగా వ్యవహరించిన ఏపీపీ స్వర్ణలత భాను, ఎస్ఐలు జ్ఞానప్రసాద్, కేకే నాయుడులను ఎస్పీ అభినందించారు.