Share News

గంజాయి కేసులో ఒకరికి ఏడాది జైలు

ABN , Publish Date - Aug 01 , 2026 | 12:33 AM

జిల్లాలోని కొత్తవలస పోలీసుస్టేషన్‌లో 2021లో నమోదైన గంజాయి కేసులో ఏఎస్‌ఆర్‌ జిల్లా దుంబ్రి గూడ మండలం సున్నంమెట్ట గ్రామానికి చెందిన తామర్ల ధర్మకు ఏడాది కఠిన కారాగార శిక్ష, రూ.10వేలు జరిమానా విధిస్తూ విజయనగరం ఫస్ట్‌ అడిషనల్‌ డిస్ట్రిట్‌ సెషన్స్‌ న్యాయాధికారి కె.విజయకళ్యాణి శుక్రవారం తీర్పు వెల్లడించినట్టు ఎస్పీ దామోదర్‌ తెలిపారు.

గంజాయి కేసులో ఒకరికి ఏడాది జైలు

విజయనగరం దాసన్నపేట, జూలై 31(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని కొత్తవలస పోలీసుస్టేషన్‌లో 2021లో నమోదైన గంజాయి కేసులో ఏఎస్‌ఆర్‌ జిల్లా దుంబ్రి గూడ మండలం సున్నంమెట్ట గ్రామానికి చెందిన తామర్ల ధర్మకు ఏడాది కఠిన కారాగార శిక్ష, రూ.10వేలు జరిమానా విధిస్తూ విజయనగరం ఫస్ట్‌ అడిషనల్‌ డిస్ట్రిట్‌ సెషన్స్‌ న్యాయాధికారి కె.విజయకళ్యాణి శుక్రవారం తీర్పు వెల్లడించినట్టు ఎస్పీ దామోదర్‌ తెలిపారు. ఈ కేసుపై ఆయన తెలిపిన వివరాలు ఇలా ఉన్నా యి. 2021 ఆగస్టు 6న కొత్తవలస పోలీసుస్టేషన్‌ పరిధిలో తామర్ల ధర్మ అనే వ్యక్తి ద్విచక్ర వాహనంపై గంజాయి రవాణా చేస్తుండగా పోలీసులు గుర్తించి, పట్టుకు న్నారు. అతని వద్ద ఉన్న బ్యాగులో 2కిలోల 400 గ్రాముల గంజాయిని గుర్తించి, స్వాధీనం చేసుకున్నారు. అప్పటి కొత్తవలస సీఐ బాల సూర్యారావు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు. కో ర్టులో అభియోగ పత్రాలు దాఖలు చేయగా, నిందితుడిపై నేరారోపణలు రుజువు అయ్యింది. దీంతో జైలు శిక్షతో పాటు జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించారు. ఈ కేసులో క్రియాశీలకంగా వ్యవహరించిన సీఐ విజయ్‌కుమార్‌, హెచ్‌సీ అప్పలనా యుడు, కానిస్టేబుల్‌ త్రినాథ్‌రావు, ఏపీపీ రేవతిలను ఎస్పీ అభినందించారు.

Updated Date - Aug 01 , 2026 | 12:33 AM