ఉన్నత లక్ష్యాలను సాధించాలి
ABN , Publish Date - Nov 06 , 2026 | 11:47 PM
విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని, ఉన్నత లక్ష్యాలను సాధించాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ న్యాయాధికారి డా.కృష్ణప్రసాద్ సూచించారు.
డీఎల్‌ఎస్‌ఏ కార్యదర్శి కృష్ణప్రసాద్
విజయనగరం దాసన్నపేట, నవంబరు 6(ఆంధ్రజ్యోతి): విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని, ఉన్నత లక్ష్యాలను సాధించాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ న్యాయాధికారి డా.కృష్ణప్రసాద్ సూచించారు. గంట్యాడలోని బీసీ వసతిగృహాల ను ఆయన శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు కల్పిస్తున్న మౌలిక సదుపాయాలు, పరిసరాల పరిశుభ్రత, తాగునీటి సౌకర్యం, మరుగుదొడ్ల నిర్వహణ, భోజన నాణ్యత, ఆహార మెనూ తదితర అంశాలను పరిశీలించారు. విద్యార్థులతో నేరుగా మాట్లాడి, ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం కల్పిస్తున్న విద్య, సంక్షేమ సదుపాయాలను సద్విని యోగం చేసుకోవాలని, ఆరోగ్యం, భద్రత పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. వసతిగృహాల్లో మెరుగైన వాతావరణం కల్పించాలని అధికారులకు ఆదేశించారు. విద్యార్థుల హక్కులు, సంక్షేమం, మెరుగైన విద్య, వాతావరణం కల్పించడం ప్రతిఒక్కరి బాధ్యతన్నారు. ఈ కార్యక్రమంలో వసతిగృహ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.