Share News

చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి

ABN , Publish Date - Nov 21 , 2026 | 11:59 PM

: చెడు వ్యసనాలకు, చెడు సహవాసాలకు చాలా దూరంగా ఉండాలని సీనియర్‌ సివిల్‌ న్యాయాధికారి ఎ.రాధాకృష్ణమూర్తి తెలిపారు. శనివారం బొబ్బిలి పట్టణంలోని పలు విద్యాసంస్ధల్లో రాధాకృష్ణమూర్తి ఆధ్వర్యంలో న్యాయఅవగాహన సదస్సు నిర్వహించారు.

చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి

బొబ్బిలి, నవంబరు 21(ఆంధ్రజ్యోతి): చెడు వ్యసనాలకు, చెడు సహవాసాలకు చాలా దూరంగా ఉండాలని సీనియర్‌ సివిల్‌ న్యాయాధికారి ఎ.రాధాకృష్ణమూర్తి తెలిపారు. శనివారం బొబ్బిలి పట్టణంలోని పలు విద్యాసంస్ధల్లో రాధాకృష్ణమూర్తి ఆధ్వర్యంలో న్యాయఅవగాహన సదస్సు నిర్వహించారు.ఈసందర్భంగా విద్యార్థుల హక్కులు, భద్రత, బాధ్యతలు, విద్యకు సంబంధించిన పలు విషయాలను వారికి వివరించారు. పోక్సో చట్టంపై అవగాహన కల్పించారు. నేటి తరం యువత మత్తు పానీయాలకు, ఇతర దురలవాట్లకు బాగా ఆకర్షితులై బంగారు భవిష్యత్‌ను చేజేతు లా నాశనం చేసుకుంటున్నారని తెలిపారు.

Updated Date - Nov 21 , 2026 | 11:59 PM