సమాజానికి ఆదర్శంగా నిలవాలి
ABN , Publish Date - Aug 08 , 2026 | 12:10 AM
ss
గుమ్మలక్ష్మీపురం, ఆగస్టు 7 (ఆంధ్రజ్యోతి): బాలికలు సమాజానికి ఆదర్శంగా నిల వాలని కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం గుమ్మలక్ష్మీపురం కేజీబీవీలో విద్యార్థినులతో మాట్లాడారు. చదువు, భవిష్యత్ లక్ష్యాలు, ఆరోగ్యం గురించి ఆరాతీశారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని మలేరియా వంటి జ్వరాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పాఠశాలలో విద్యార్థినులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని సిబ్బందిని ఆదేశించారు. రాష్ట్రంలో ఉత్తమ కేజీబీవీగా అవార్డు పొంది నందుకు ప్రిన్సిపాల్ రంజని, ఉపాధ్యాయులు, సిబ్బందిని కలెక్టర్ అభినందించారు.