Share News

హిందూ ధర్మం విశిష్టతను తెలుసుకోవాలి

ABN , Publish Date - Jan 04 , 2026 | 11:54 PM

హిందూ ధర్మం విశిష్టతను ప్రతి భారతీయుడు తెలుసుకోవాల ని స్వామి శ్రీనివాసానంద సరస్వతి తెలిపారు.

హిందూ ధర్మం విశిష్టతను తెలుసుకోవాలి
మాట్లాడుతున్న శ్రీనివాసానందసరస్వతి స్వామి:

బొబ్బిలి, జనవరి 4 (ఆంధ్రజ్యో తి): హిందూ ధర్మం విశిష్టతను ప్రతి భారతీయుడు తెలుసుకోవాల ని స్వామి శ్రీనివాసానంద సరస్వతి తెలిపారు. బొబ్బిలి రాజా కళాశాల మైదానంలో ఆర్‌ఎస్‌ఎస్‌ ఆవిర్భ వించి వందేళ్లు పూర్తి చేసుకుంటు న్న సందర్భంగా ఆదివారం హిం దూ సమ్మేళనం నిర్వహించారు. హిందూ సమ్మేళనం నిర్వహణా సమితి ప్రతినిధి రౌతు వాసుదేవరా వు అధ్యక్షతన జరిగిన సభలో స్వామి శ్రీనివాసానంద సరస్వతి మాట్లాడా రు. హిందువులంతా సంఘటితమైతే సమీప భవిష్యత్‌లో భారత్‌ విశ్వగురుస్థానంతో పూర్వవైభవాన్ని సంతరించుకోవడం ఖాయమన్నారు. ఎమ్మెల్యే బేబీనాయన మాట్లాడుతూ బొబ్బిలిలో హిందూ సమ్మేళనం సభ ద్వారా మరోసారి పౌరుల్లో ప్రేరణాశక్తిని రగిలించినట్లయ్యిందన్నారు. ఈ సందర్భంగా తప్పెటగుళ్లు, కోలాటం, కళాధార్మిక ప్రదర్శనలు ఆకట్టుకున్నా యి. కార్యక్రమంలో అక్యాన బాల త్రివేణి, బీఎంఎస్‌ రాష్ట్ర కార్యదర్శి లోవ రెడ్డి, సమ్మేళనం నిర్వహణా ప్రతినిధులు పొట్టేలు రవి, గోనా మానస, ఈ. సత్యనారాయణ, డాక్టర్‌ రావాడ సత్యనారాయణ, రాజశేఖర్‌, ముగడ అనీల్‌ కుమార్‌, పెంట స్వామినాయుడు, చెలికాని కేశవ పాల్గొన్నారు.

Updated Date - Jan 04 , 2026 | 11:54 PM