Share News

ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించాలి

ABN , Publish Date - Sep 10 , 2026 | 12:16 AM

ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం అవసరమని అంగన్‌వాడీ పర్యవేక్షక అధికారి జ్యోతి తెలిపారు.

ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించాలి
గరివిడి: ర్యాలీ నిర్వహిస్తున్న అంగన్‌వాడీ కార్యకర్తలు

గరివిడి, సెప్టెంబరు 9(ఆంధ్రజ్యోతి): ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం అవసరమని అంగన్‌వాడీ పర్యవేక్షక అధికారి జ్యోతి తెలిపారు. బుధవారం పాత గరివిడి ప్రాంతంలో తొమ్మిదో జాతీయ పోషణ మాసోత్సవాల్లో భాగంగా పోషణతో ఆరోగ్యం-ఆరోగ్యంతో అభివృద్ధి అన్న నినాదంతో నెల రోజులపాటు నిర్వహించనున్న కార్యక్రమాలను ప్రారంభించారు. పట్టణంలోని పలు అంగన్‌వాడీ కేంద్రాల ఆధ్వర్యం లో నిర్వహించిన కార్యక్రమంలో చిన్నారులు, గర్భిణులు, బాలింతలు, తల్లిదండ్రులకు పౌష్టికాహారం, ఆరోగ్య పరిరక్షణ, పరిశుభ్రతపై అవగాహన కల్పించారు.

Updated Date - Sep 10 , 2026 | 12:16 AM