విద్యుదాఘాతంతో ఒకరికి తీవ్ర గాయాలు
ABN , Publish Date - Jun 28 , 2026 | 12:00 AM
విద్యుదాఘాతంతో ఒక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.
దత్తిరాజేరు (మెంటాడ), జూన్ 24(ఆంధ్రజ్యోతి): విద్యుదాఘాతంతో ఒక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. మెంటాడ మండలంలోని శీలవలస గ్రామానికి చెందిన సుందరరావు కొండలింగావలస పంచాయతీ సవరవిల్లి గ్రామంలోని తన బంధువుల ఇంటికి శుభకార్యం నిమిత్తం వెళ్లాడు. బంధువుల ఇంటికి కరెంటు లేకపోవ డంతో విద్యుత్ స్తంభం ఎక్కే క్రమంలో షాక్‌కు గురయ్యాడు. దీంతో తీవ్ర గాయాలయ్యాయి. మేరకు బంధువులు క్షతగాత్రుడిని 108 వాహనంలో గజపతినగరం ఏరియా ఆసుపత్రికి తలించారు. వైద్యులు చికిత్స అందిస్తున్నారు.