Share News

గంజాయి కేసులో ఒకరికి మూడేళ్ల జైలు

ABN , Publish Date - Jun 30 , 2026 | 12:23 AM

నగరంలోని వన్‌టౌన్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో 2023లో నమోదైన గంజాయి కేసులో నగరంలోని గోక పేటలో నివాసం ఉంటున్న బొంతు వెంకటేశ్వరరావుకు మూడేళ్లు కఠిన కారాగార శిక్షతో పాటు, రూ.30వేలు జరిమానా విధిస్తూ ఏడీజే, ఎన్‌డీపీఎస్‌ యాక్టు స్పెషల్‌ న్యాయాధికారి కె.విజయకళ్యాణి సోమవారం తీర్పు వెల్లడించినట్టు ఎస్పీ దామోద ర్‌ తెలిపారు.

గంజాయి కేసులో ఒకరికి మూడేళ్ల జైలు

విజయనగరం దాసన్నపేట, జూన్‌ 29(ఆంధ్రజ్యోతి): నగరంలోని వన్‌టౌన్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో 2023లో నమోదైన గంజాయి కేసులో నగరంలోని గోక పేటలో నివాసం ఉంటున్న బొంతు వెంకటేశ్వరరావుకు మూడేళ్లు కఠిన కారాగార శిక్షతో పాటు, రూ.30వేలు జరిమానా విధిస్తూ ఏడీజే, ఎన్‌డీపీఎస్‌ యాక్టు స్పెషల్‌ న్యాయాధికారి కె.విజయకళ్యాణి సోమవారం తీర్పు వెల్లడించినట్టు ఎస్పీ దామోద ర్‌ తెలిపారు. ఈ కేసుపై ఎస్పీ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. విజయనగరం మండలం చెల్లూరు గ్రామానికి చెందిన బొంతు వెంకటేశ్వరరావు నగరంలోని గోక పేటలో నివాసం ఉండేవాడు. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులో గుర్తు తెలి యని వ్యక్తుల వద్ద ఐదు కిలోల గంజాయి కొనుగోలు చేసి.. వాటిని చిన్న పొట్లాలుగా చేసి.. 2023 మే 25న ఆర్‌అండ్‌బీ జంక్షన్‌ వద్ద విక్రయించేందుకు సిద్ధపడ్డాడు. గుర్తించిన వన్‌టౌన్‌ పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. అతని వద్ద ఉన్న గంజాయిని స్వాధీనం చేసుకుని, అతన్ని రిమాండ్‌కు తరలించారు. వెంకటే శ్వరరావుపై నేరం నిరూపణ కావడంతో పై విధంగా తీర్పు వెల్లడించారు. నింది తుడు జరిమానా చెల్లించలేని పక్షంలో మరో ఆరు నెలలు సాఽధారణ శిక్ష అనుభ వించాలని తీర్పులో పేర్కొన్నారు. ఈ కేసును అప్పటి ఎస్‌ఐ భాస్కరరావు నమో దు చేయగా, అప్పటి సీఐ వెంకటరావు నిందితుడిని అరెస్టు చేసి, తదుపరి బాధ్య తలు చేపట్టిన సీఐ.. చార్జిషీటు దాఖలు చేశారు. పోలీసుల తరపున స్వర్ణలత వాదనలు వినిపించగా, సకాలంలో కోర్టు కానిస్టేబుల్‌ త్రినాథ్‌ సాక్ష్యాలను ప్రవే శపెట్టడంతో నిందితుడికి శిక్ష పడింది. ఈ కేసులో శిక్ష పడే విధంగా కృషి చేసిన పోలీసు అధికారులు, ప్రాసిక్యూషన్‌ అధికారులను ఎస్పీ అభినందించారు.

Updated Date - Jun 30 , 2026 | 12:23 AM