కొట్లాటలో ఒకరి మృతి
ABN , Publish Date - May 23 , 2026 | 12:26 AM
కోనాడ పంచాయతీ బొడ్డు గురవయ్యపేటలో గృహాల మధ్య ఖాళీ స్థలాన్ని బాగుచేసుకునే క్రమంలో ఇరు కుటుంబాల మధ్య జరిగిన కొట్లాటలో బొడ్డు రాములు(61) అనే మత్స్యకారుడు మృతిచెందినట్లు ఎస్‌ఐ దుర్గాప్రసాదు శుక్రవారం తెలిపారు.
పూసపాటిరేగ(భోగాపురం), మే 22 (ఆంధ్రజ్యోతి): కోనాడ పంచాయతీ బొడ్డు గురవయ్యపేటలో గృహాల మధ్య ఖాళీ స్థలాన్ని బాగుచేసుకునే క్రమంలో ఇరు కుటుంబాల మధ్య జరిగిన కొట్లాటలో బొడ్డు రాములు(61) అనే మత్స్యకారుడు మృతిచెందినట్లు ఎస్‌ఐ దుర్గాప్రసాదు శుక్రవారం తెలిపారు. ఆయన అందించిన వివరాల ప్రకారం.. బొడ్డుగురవయ్యపేటకు చెందిన పలువురు మత్స్యకార కుటుం బాలు విశాఖలో నివాసం ఉంటూ చేపలవేట చేస్తూ జీవనాధారం పొందుతు న్నారు. అయితే ఈనెల 26న గ్రామ దేవత పండగ ఉండడంతో పలు కుటుంబా లు సొంత గ్రామం బొడ్డుగురవయ్యపేట చేరుకున్నారు. బొడ్డు రాములు, బొడ్డు అశోక్ గృహాల మధ్య కొంత ఖాళీ స్థలం(రస్తా) ఉంది. ఆ స్థలంలో అన్నదమ్ము లైన బొడ్డు అశోక్, అప్పన్న, అమ్మోరు కలిసి సిమెంటుతో గచ్చు చేశారు. దీంతో మధ్యలో ఉన్న ఖాళీ స్థలం ఏవిధంగా గచ్చు చేస్తావంటూ రాములు ప్రశ్నించాడు. దీంతో ముగ్గురు కలిసి రాములతో ఘర్షణ పడ్డారు. ఈ ఘర్షణలో రాములు కుప్పకూలి మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. దీనిపై మృతుడు బంధువు అయిన బొడ్డు అప్పన్న ఇచ్చిన పిర్యాదు మేరకు హత్య కేసుగా నమోదు చేశామనొ ఎస్‌ఐ దుర్గాప్రసాదు తెలిపారు.