చీటింగ్ కేసులో ఒకరికి జైలు
ABN , Publish Date - Jan 11 , 2026 | 11:55 PM
చీటింగ్ కేసులో నిందితుడికి ఎస్.కోట కోర్టు న్యాయాధికారి బి.కనకలక్ష్మి.. 20 రోజుల జైలు, రూ.10వేలు జరి మానా విధించినట్టు సీఐ నారాయణమూర్తి ఆదివారం తెలిపారు.
ఎస్.కోట రూరల్, జనవరి 11(ఆంధ్రజ్యోతి): చీటింగ్ కేసులో నిందితుడికి ఎస్.కోట కోర్టు న్యాయాధికారి బి.కనకలక్ష్మి.. 20 రోజుల జైలు, రూ.10వేలు జరి మానా విధించినట్టు సీఐ నారాయణమూర్తి ఆదివారం తెలిపారు. ఈ ఘటనపై ఆయన తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఎస్.కోటకు చెందిన రంధీ గోపీకి వేపాడ మండలం అతవ గ్రామానికి చెందిన సీహెచ్ కృష్ణ.. బ్యాంకు ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి 2015లో రూ.7లక్షల 54వేలు తీసుకుని మోసం చేశాడు. దీనిపై గోపి అందించిన ఫిర్యాదు మేరకు అప్పటి ఎస్‌ఐ సాగర్‌బాబు కేసు నమోదు చేశారు. దర్యాప్తు అనంతరం ఎస్‌ఐ రవికుమార్ చార్జీషీటు ఫైల్ చేశారు. విచారణ తర్వాత న్యాయాధికారి పైవిధంగా తీర్పు ఇచ్చారు.