Share News

సెల్‌ఫోన్ల చోరీ కేసులో ఒకరి అరెస్టు

ABN , Publish Date - Jan 23 , 2026 | 12:06 AM

రైల్వే ప్లాట్‌ఫాంలు, రన్నింగ్‌ ట్రైన్లలో ప్రయాణికుల వద్ద నుంచి సెల్‌ఫోన్ల దొంగతనాలకు పాల్పడుతున్న చతీస్‌ఘడ్‌ రాష్ట్రం సుబేలాబిలాయి జిల్లా సుందర్‌నగర్‌కు చెందిన రాజేష్‌ సాహుతో పాటు ఓ బాలుడిని అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి రూ.లక్ష విలువైన మూడు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు విజయనగరం జీఆర్‌పీ ఎస్‌ఐ బాలాజీరావు గురువారం తెలిపారు.

సెల్‌ఫోన్ల చోరీ కేసులో ఒకరి అరెస్టు

విజయనగరం క్రైం, జనవరి 22(ఆంధ్రజ్యోతి): రైల్వే ప్లాట్‌ఫాంలు, రన్నింగ్‌ ట్రైన్లలో ప్రయాణికుల వద్ద నుంచి సెల్‌ఫోన్ల దొంగతనాలకు పాల్పడుతున్న చతీస్‌ఘడ్‌ రాష్ట్రం సుబేలాబిలాయి జిల్లా సుందర్‌నగర్‌కు చెందిన రాజేష్‌ సాహుతో పాటు ఓ బాలుడిని అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి రూ.లక్ష విలువైన మూడు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు విజయనగరం జీఆర్‌పీ ఎస్‌ఐ బాలాజీరావు గురువారం తెలిపారు. ఆర్‌పీఎఫ్‌ సీపీడీఎస్‌ టీం, ఎఎస్‌ఐ మురళీకృష్ణ, సిబ్బంది గజపతినగరం రైల్వేస్టేషన్‌లో వీరిని అదుపులోకి తీసుకుని విచారించగా, సెల్‌ఫోన్‌ దొంగతనానికి పాల్పడుతున్నట్టు నేరాన్ని అంగీకరించార ని ఎస్‌ఐ తెలిపారు. సాహుని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామని, మైనర్‌ను జువైనల్‌ కోర్టుకు హాజరుపరిచామన్నారు.

Updated Date - Jan 23 , 2026 | 12:07 AM