Share News

చికిత్సపొందుతూ ఒకరి మృతి

ABN , Publish Date - Feb 01 , 2026 | 12:06 AM

మండలంలోని చింతాడ గ్రామా నికి చెందిన నెమలాపు లక్ష్మణరావు (50) చికిత్సపొందుతూ మృతిచెందాడు.

 చికిత్సపొందుతూ ఒకరి మృతి

బొబ్బిలి రూరల్‌, జనవరి 31(ఆంధ్రజ్యోతి): మండలంలోని చింతాడ గ్రామా నికి చెందిన నెమలాపు లక్ష్మణరావు (50) చికిత్సపొందుతూ మృతిచెందాడు. ఏఎస్‌ఐ కొండలరావు కథనం మేరకు.. కొన్నేళ్లుగా లక్ష్మణరావు మద్యానికి బానిసై అప్పులు చేస్తున్నాడు. ఈనేపథ్యంలో భార్య రామలక్ష్మి మందలించిందన్న మన స్థాపంతో గత నెల 30న తన ఇంట్లో వ్యవసాయం కోసం తెచ్చి ఉంచిన పురు గుల మందు తాగాడు. విషయం తెలుసుకున్న భార్య వెంటనే 108 ద్వారా బొబ్బి లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స నిమిత్తం విజయనగరం రిఫర్‌ చేశారు. విజయన గరం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారు జామున మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఆయనకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. లక్ష్మణరావు భార్య ఫిర్యాదు మేరకు బొబ్బిలి పోలీస్‌ స్టేషన్‌లో ఏఎస్‌ఐ కొండలరావు కేసు నమోదు చేశారు.

Updated Date - Feb 01 , 2026 | 12:06 AM