Share News

అనుమానాస్పద స్థితిలో ఒకరి మృతి

ABN , Publish Date - May 10 , 2026 | 12:32 AM

పట్టణ శివారున ప్రధాన రహదారి పక్కన ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతిచెంది ఉన్నాడు.

  అనుమానాస్పద స్థితిలో ఒకరి మృతి

పాలకొండ, మే 9 (ఆంధ్రజ్యోతి): పట్టణ శివారున ప్రధాన రహదారి పక్కన ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతిచెంది ఉన్నాడు. శనివారం మధ్యాహ్నం ఈ మృతదేహాన్ని స్థానికు లు గుర్తించారు. శరీరంపై దుస్తులు లేకుండా ఉండడంతో తొలుత పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఎవరైనా హత్య చేశారా, లేదా సాధారణ మరణమా అనే దానిపై చర్చ జరగ గా పట్టణంలోని ఎన్‌ఎస్‌ఎన్‌ కాలనీరి చెందిన బుడ్డి (55)గా గుర్తించారు. ఈయన గత కొద్దిరోజులుగా మానసికంగా ఇబ్బం దులు పడుతూ మద్యానికి బానిసై తిరుగుతున్నట్టు తేలింది. ఈ కోవలోనే మరణించి ఉంటాడని భావించి వారి బంధువు లకు సమాచారం అందించారు. వారి బంధువులు మృతదేహా న్ని తరలించారు. దీనిపై ఎటువంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.

Updated Date - May 10 , 2026 | 12:33 AM