Share News

పురుగు మందు తాగి ఒకరి మృతి

ABN , Publish Date - Jan 25 , 2026 | 12:20 AM

కొండరాజుపేట మధుర జగన్నాథపురం గ్రామానికి చెందిన బాడితబోయిన సంతోష్‌కుమార్‌(25) బతుకుపై విరక్తి చెంది పురుగు మందు తాగి మృతిచెందాడు.

 పురుగు మందు తాగి ఒకరి మృతి

డెంకాడ, జనవరి 24(ఆంధ్రజ్యోతి): కొండరాజుపేట మధుర జగన్నాథపురం గ్రామానికి చెందిన బాడితబోయిన సంతోష్‌కుమార్‌(25) బతుకుపై విరక్తి చెంది పురుగు మందు తాగి మృతిచెందాడు. ఈ సంఘటనకు సంబంధించి ఎస్‌ఐ ఆరంగి సన్యాసినాయుడు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. జగన్నాథపురం గ్రామానికి చెందిన బాడితిబోయిన అప్పన్న కుమారుడు సంతోష్‌కుమార్‌ ఆరో గ్యం సరిగా లేక తరచూ దగ్గు, కఫం, ఆయాసంతో బాధపడుతున్నాడు. జీవితం పై విరక్తి చెంది శుక్రవారం రాత్రి 9 గంటల సమయంలో పురుగు మందు తాగి ఇంటికి వచ్చాడు. వాంతులు చేసుకోవడంతో తల్లి పెంటమ్మ అడగ్గా.. పురుగు మందు తాగానని చెప్పాడు. వెంటనే విజయనగరం మహారాజా ఆసుపత్రికి తర లించారు. చికిత్స పొందుతూ అదేరోజు రాత్రి 12.30కు మృతిచెందాడు. అందిన ఫిర్యాదు మేరకు డెంకాడ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Jan 25 , 2026 | 12:20 AM