చికిత్స పొందుతూ ఒకరి మృతి
ABN , Publish Date - Apr 05 , 2026 | 11:59 PM
శ్రీకాకుళం జిల్లా వత్సవలస గ్రామంలో రాజమ్మను శనివారం దర్శించుకుని తిరిగి స్వగ్రామానికి వెళుతున్న రేగిడి మండలం అంబఖండికి చెందిన లుకలాపు వెంకటరమణ(45) ఆటో బోల్తా పడిన ఘటనలో మృతిచెందాడు.
గార, ఏప్రిల్ 5 (ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం జిల్లా వత్సవలస గ్రామంలో రాజమ్మను శనివారం దర్శించుకుని తిరిగి స్వగ్రామానికి వెళుతున్న రేగిడి మండలం అంబఖండికి చెందిన లుకలాపు వెంకటరమణ(45) ఆటో బోల్తా పడిన ఘటనలో మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. వెంకటరమ ణ కూర్చున్న ఆటో శనివారం కొర్లాం రోడ్డు మలుపు వద్ద బోల్తాపడింది. ఈ సమ యంలో వెంకటరమణ ఆటోలోంచి కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడిని శ్రీకాకుళంలోని ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించగా అక్కడ చికిత్స పొందు తూ ఆదివారం ఉదయం మృతి చెందినట్లు గార ఎస్‌ఐ సీహెచ్ గంగరాజు తెలి పారు. మృతుడి కుమారుడు రాకేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.